News January 16, 2025

NZB: పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నాం: జీవన్ రెడ్డి 

image

కాంగ్రెస్ కొమ్ము గాస్తున్నా పోలీసుల పేర్లు పింక్ బుక్‌లో ఎక్కిస్తున్నామని ఆర్మూర్ మాజీ MLA జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు. హోం మంత్రిత్వశాఖను కూడా నిర్వ హిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వరెస్ట్ పాలనలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారి అరెస్టుల పర్వం కొనసాగుతోందని ఆరోపించారు. ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై ప్రశ్నిస్తే అక్రమ నిర్బందాలా..? అని ఆయన మండిపడ్డారు. 

Similar News

News February 14, 2025

కోటగిరి పంచాయతీ కార్యదర్శికి కఠిన కారాగార శిక్ష

image

లంచం తీసుకున్న కేసులో కోటగిరి పంచాయతీ కార్యదర్శి సుదర్శన్‌కు ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ. 40,000 జరిమానా విధిస్తూ ఏసీబీ నాంపల్లి కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి మహమ్మద్ ఆఫ్రొజ్ అక్తర్ తీర్పు నిచ్చారు. 2014లో వడ్డే నర్సింహులు తండ్రి పేరు మీద ఉన్న ఇళ్లను అయన, అతని సోదరుడి పేరు మీద బదిలీ చేయడం కోసం కార్యదర్శి రూ.8,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కోర్టు విచారించి, తీర్పునిచ్చింది.

News February 14, 2025

NZB: కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి

image

కుంభమేళాకు వెళ్లి వస్తూ రైలులో మహిళ మృతి చెందినట్లు నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయిరెడ్డి తెలిపారు. జైపూర్-హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లోని S5 కోచ్‌లో తోటి భక్తులతో ప్రయాణిస్తున్న అనిత (59) అనారోగ్యంతో మృతి చెందిందన్నారు. మృతురాలిది కర్ణాటకలోని బీదర్ జిల్లా మిర్జాపూర్ గ్రామమని ఎస్సై వివరించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని NZB GGH మార్చురీకి తరలించామని చెప్పారు.

News February 14, 2025

NZB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

image

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

error: Content is protected !!