News April 24, 2024

NZB: పోలీస్ ఔట్ పోస్ట్ సమీపంలో కత్తిపోట్లు

image

నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి వద్ద పోలీస్ ఔట్ పోస్టు సమీపంలో సోమవారం సాయంత్రం కత్తిపోట్లు జరిగాయి. ఈ ఘటనలో అక్రం ఖాన్ అనే యువకుడు ఫిరోజ్ ఖాన్ అనే యువకుడిపై కత్తితో దాడికి దిగాడు. దీనితో ఫిరోజ్ ఖాన్ గొంతు తెగి తీవ్ర రక్తస్రావం అయ్యింది. గంజాయి మత్తులో పాత కక్షల కారణంగా ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు.

Similar News

News January 14, 2025

నవీపేట్: సంక్రాంతి వేడుకల్లో అపశృతి

image

నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. చైనా మంజాతో ఓ యువకుడి గొంతుతో పాటు రెండు వేళ్లు తెగాయి. దీంతో వెంటనే అతణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. చైనా మాంజా వాడొద్దని అధికారులు, పోలీసులు హెచ్చరిస్తున్నా దుకాణదారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా చైనా మాంజాను వాడకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

News January 14, 2025

NZB: గల్ఫ్‌లో యాక్సిడెంట్.. రూ.55 లక్షల పరిహారం

image

గల్ఫ్‌లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం జ్యాగిర్యాల గ్రామానికి చెందిన గద్దల రాజు కుటుంబానికి రూ.55 లక్షల పరిహారం యాబ్ లీగల్ సర్వీసెస్ సీఈవో సలాం పాపినిస్సేరి సోమవారం అందజేశారు. 2022లో గల్ఫ్‌లో రాజు రోడ్డు దాటుతుండగా ప్రమాదం జరిగి మృతి చెందారు. యాబ్ లీగల్ సర్వీసెస్ ద్వారా పరిహారం వచ్చింది. షేక్ ఆల్ అజీజ్, రవుఫ్, మునీత్ తదితరులు పాల్గొన్నారు.

News January 14, 2025

బాల్కొండ: హైవేపై యాక్సిడెంట్ యువకుడి మృతి

image

బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి స్వగ్రామం నిర్మల్ జిల్లా బొప్పారం అని బాల్కొండ ఎస్ఐ నరేష్ తెలిపారు. పండగ వేళ తీవ్ర విషాదమని, అత్యంత వేగంగా వెళ్ళడమే ప్రమాదానికి కారణమని ఎస్ నరేష్, ఏఎస్ఐ శంకర్ తెలిపారు.