News March 11, 2025

NZB: పోలీస్ స్టేషన్‌లో వ్యక్తికి సంకెళ్లు

image

పోలీస్ స్టేషన్‌లో ఓ వ్యక్తితో వెట్టి చాకిరి చేయించిన ఘటన బోధన్‌లో జరిగింది. ఓ కేసులో అరెస్టు చేసిన వ్యక్తి కాళ్లకు సంకెళ్లు వేసి ఆ వ్యక్తితో పోలీస్ స్టేషన్‌ను ఊడిపించారు. కానిస్టేబుల్ గంగాధర్ ముందే పోలీస్ స్టేషన్‌లో చీపురుతో క్లీన్ చేస్తున్న చిత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Similar News

News May 7, 2025

NZB: ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తి మృతి

image

NZB ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు వన్ టౌన్ SHO రఘుపతి తెలిపారు. ఆసుపత్రి రేకుల షెడ్డు కింద అపస్మారక స్థితిలో పడి ఉండడంతో సదరు వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వయసు 40-45 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు. మృతుడి జేబులో తినాలి రవి, ఆర్మూరు మండలం మామిడిపల్లి అనే ఆధార్ కార్డు ఉందన్నారు.

News May 7, 2025

నిజామాబాద్: బావిలో పడి వ్యక్తి మృతి

image

జక్రాన్‌పల్లిలో బావిలో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఎస్ఐ తిరుపతి తెలిపారు. గ్రామానికి చెందిన మాడవీరి ముత్యం(50) తాగిన మైకంలో ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందాడు. బావిలో మృతదేహం తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ తిరుపతి మృతదేహాన్ని బయటకు తీయించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 7, 2025

NZB: జిల్లా వాసికి జాతీయ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా వాసికి జాతీయ స్థాయి అవార్డు లభించింది. జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ మేనేజింగ్ కమిటీ సభ్యుడు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్ రెడ్ క్రాస్ జాతీయ స్థాయి అవార్డుకు ఎంపికయ్యారు. వచ్చే నెల 13న రాష్ట్రపతి భవన్‌లో జరిగే సమావేశంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు. ఈ నేపథ్యంలో రాజశేఖర్‌ను జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ సభ్యులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు అభినందించారు.