News June 17, 2024
NZB: ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్

బక్రీద్ వేడుకను పురస్కరించుకుని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నిజామాబాద్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ వేడుకను ఆధ్యాత్మిక వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అన్ని వర్గాల ప్రజలు సుఖః సంతోషాలతో ఉండాలని, సౌభ్రాతృత్వం, సుహృద్భావ వాతావరణం వెల్లివిరియాలని కోరారు. సోమవారం నాటి వేడుకను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని సూచించారు.
Similar News
News January 22, 2026
NZB: గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ వ్యూహాలు

త్వరలో జరగబోయే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార కాంగ్రెస్, బీజేపీ పార్టీల అధినేతలు వ్యూహాలు రూపొందిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో మొత్తం 60 డివిజన్లు ఉండగా 20 డివిజన్లలో MIM ప్రాధాన్యత ఉంది. మిగిలిన 40 డివిజన్లలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రభావితం చేసే అభ్యర్థుల కోసం ఇరు పార్టీలు స్క్రూటినీ చేస్తున్నాయి. అలాగే పలువురితో చర్చలు జరుపుతున్నారు.
News January 21, 2026
తెలంగాణ వర్సిటీ పీఆర్ఓగా డాక్టర్ కె.వి. రమణచారి

TU పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ (PRO)గా ఇంగ్లీష్ విభాగానికి చెందిన డాక్టర్ కె.వి. రమణచారి బుధవారం నియమితులయ్యారు. ఈ మేరకు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. గతంలో పలు కీలక అడ్మినిస్ట్రేటివ్ పదవులు నిర్వహించిన రమణచారి.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించినందుకు వీసీకి, రిజిస్ట్రార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు వర్సిటీ అధికారులు ఆయనను అభినందించారు.
News January 21, 2026
NZB: మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణీ కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ఓటరు జాబితా సిద్ధం చేయడం, పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


