News March 17, 2025

NZB: ప్రజావాణికి 64 ఫిర్యాదులు

image

ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌తో పాటు, ఆర్డీవో రాజేంద్రకుమార్‌కు  అర్జీలు సమర్పించారు. ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు.

Similar News

News July 6, 2025

పొతంగల్: అబార్షన్ అయ్యిందని వివాహిత ఆత్మహత్య

image

అబార్షన్ అయ్యిందని మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన పొతంగల్ మండలం కొడిచర్లలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కొడిచర్ల సుధాకర్‌తో మహాదేవి(28)కి నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె ఇటీవల గర్భం దాల్చగా పిండం సరిగా లేక అబార్షన్ అయ్యంది. దీంతో మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News July 6, 2025

NZB: ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలి

image

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు సూచించారు.

News July 6, 2025

NZB: VRకు ఏడుగురు SI

image

బాసర జోన్ పరిధిలో 14 మంది ఎస్ఐలు బదిలీ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఏడుగురిని వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. సిరికొండ SHO రాము, మోపాల్ SHO యాదగిరి, ఎడపల్లి SHO వంశీ కృష్ణ, మెండోరా SHO యాసిర్ అరాఫత్, ఏర్గట్ల SHO రామును నిజామాబాద్ VRకు పంపించారు. బాల్కొండ SHO నరేశ్, మోర్తాడ్ SHO విక్రమ్‌ను ఆదిలాబాద్ VRకు అటాచ్ చేశారు.