News January 6, 2025

NZB: ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్

image

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ అంకిత్, మున్సిపల్ కమిషనర్ దిలీప్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులతో కలిసి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి వినతుల స్వీకరించారు. ప్రజావాణిలో నమోదైన ఫిర్యాదులను పెండింగ్‌లో పెట్టకుండా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

Similar News

News January 17, 2025

రాజంపేట: చైన్ స్నాచింగ్‌కు యత్నించి.. ఖాళీ చేతులతో

image

బైక్‌పై వెళ్తున్న దుండగులు ఆటోలో వెళ్తున్న ఓ మహిళ మెడలో నుంచి చైన్ లాగేందుకు ప్రయత్నించగా గొలుసు తెగి ఆమె ఒడిలో పడింది. ఈ ఘటన రాజంపేట మండలం అరగొండ హైస్కూల్ వద్ద గురువారం జరిగింది. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా అనుమానితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. ఈ విషయమై బిక్కనూరు సీఐ సంపత్ మాట్లాడుతూ.. యూనికార్న్ బైక్‌పై ఉన్న వ్యక్తులను ఎవరైనా గుర్తిస్తే 8712686153 నంబర్‌కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు.

News January 17, 2025

NZB: అబద్ధాలు చెప్పి CM కాలం గడుపుతున్నారు: MLA వేముల

image

సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి కాలం గడుపుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. గురువారం TG భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు.. 400 రోజులైనా ఏ ఒక్క హామీ కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు.

News January 17, 2025

లింగంపేట: బీడు భూములకు రైతుభరోసా రాకుండా చూడాలి: RDO

image

రైతు భరోసా సర్వేను ఎలాంటి తప్పులు జరగకుండా నిర్వహించాలని ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రభాకర్ అన్నారు. లింగంపేట మండల కేంద్రంలో గురువారం రైతు భరోసా సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన రైతులకు రైతు భరోసా వచ్చేవిధంగా చూడాలని AEOలకు, రెవెన్యూ అధికారులను సూచించారు. బీడు భూములకు రైతు భరోసా రాకుండా చూడాలన్నారు.