News December 30, 2024
NZB: ప్రతీ ఒక్కరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి: కవిత

మనం ఊరుకుంటే ప్రభుత్వం కదలదు… ప్రతీ ఒక్కరు ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. ఆదివారం ఆమె నిజామాబాద్ సభలో మాట్లాడుతూ.. గ్రామ గ్రామాన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని సూచించారు. కాగా విద్యార్థులు, రైతులు, మహిళలను, ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని దుయ్యబట్టారు.
Similar News
News December 20, 2025
బోధన్: ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులకు నోటీసులు

బోధన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇటీవల ఇద్దరు మున్సిపల్ ఉద్యోగులు పరస్పరం గొడవకు దిగారు. ఈ ఘటనపై ఒకరిపై మరొకరు బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో మున్సిపల్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గొడవపడిన ఇద్దరు ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.
News December 20, 2025
NZB: ఎల్లుండి నుంచి యథావిధిగా ప్రజావాణి: కలెక్టర్

ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 22 (సోమవారం) నుంచి యథావిధిగా నిర్వహించడం జరుగుతుందని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని చెప్పారు.
News December 20, 2025
NZB: లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి: జిల్లా జడ్జి

జిల్లాలోని కోర్టుల్లో నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని NZB జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి సూచించారు. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. నిజామాబాద్‌లో 9, బోధన్‌లో 4, ఆర్మూర్‌లో 2 బెంచ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి సాయిసుధ పాల్గొన్నారు.


