News March 15, 2025

NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

image

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.

Similar News

News March 16, 2025

నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల 

image

నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి 5వ విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల సాగు కోసం ఇప్పటి వరకు 4విడతల్లో సుమారు 8టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని 1,213 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1396.75 అడుగుల, నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ సొలోమన్ తెలిపారు. 

News March 15, 2025

నిజామాబాద్: ఇంటర్ పరీక్షల్లో 364 మంది విద్యార్థులు గైర్హాజరు

image

నిజామాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన ఇంటర్ రెండవ సంవత్సరం మ్యాథ్స్, జువాలజీ, హిస్టరీ-2 పరీక్షకు మొత్తం 364 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 14,472 మంది విద్యార్థులకు 14,108 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగాయని అధికారులు వివరించారు.

News March 15, 2025

నిజామాబాద్: ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే రాములోరి తలంబ్రాలు

image

నిజామాబాద్ ఆర్టీసీ కార్గో ద్వారా ఇంటికే భద్రాచలం శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను అందజేయనున్నట్లు ఏటీఎం శనివారం తెలిపారు. ఏప్రిల్ 6న శ్రీరామ నవమి సందర్భంగా స్వామివారికి వినియోగించిన ముత్యాలు, తలంబ్రాలు మార్చి 14 నుంచి రూ.151 చెల్లించి బుక్ చేసుకున్న వారికి కార్గో విభాగం హోమ్ డెలివరీ చేస్తుందని వివరించారు. మరిన్ని వివరాలకు ఉమ్మడి జిల్లాలోని బస్ డిపోలను సంప్రదించాలని కోరారు. 

error: Content is protected !!