News March 15, 2025
NZB: ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తోంది: కవిత

అసెంబ్లీలో మా సభ్యులను సస్పెండ్ చేయడం.. మండలిలో మా మీద ఆన్ పార్లమెంటరి వర్డ్స్ వాడటం చుస్తే ప్రభుత్వం కక్షపురితంగా వ్యవహరిస్తున్నారని స్పష్టం అవుతోందని నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం మండలి మీడియా పాయింట్‌లో ఆమె మాట్లాడారు. శాసనమండలిలో కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్సీలు పదే పదే అబద్దాలు చెబుతున్నారని, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అడ్డుకునే ప్రయత్నం చేస్తే కక్ష సాధిస్తున్నారన్నారు.
Similar News
News April 10, 2026
NZB: మాతా శిశు మరణాలు జరగకుండా పర్యవేక్షించాలి: DMHO

మాతా శిశు మరణాలు జరగకుండా పర్యవేక్షించాలని NZB జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.రాజశ్రీ కోరారు. శుక్రవారం NZB ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని మాతా శిశు విభాగంలో జరిపిన సురక్షిత మాతృత్వ దినోత్సవం సందర్భంగా DMHO మాట్లాడారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఆశా కార్యకర్తలు గృహ సందర్శనలో వారి ప్రణాళికకు అనుగుణంగా గర్భిణులను, బాలింతలను తప్పకుండా పరిశీలించాలని ఆదేశించారు.
News April 10, 2026
NZB: కార్మికులందరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి: కమిషనర్

మున్సిపల్ కార్మికులందరూ వైద్య పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని, ఏ కార్మికుడు కూడా అనారోగ్యానికి గురి కావద్దని NZB మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులు, క్షయ వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహించారు. DMHO రాజశ్రీ తదితరులు పాల్గొన్నారు.
News April 10, 2026
TU: ముగిసిన రెండు రోజుల జాతీయ సదస్సు

టీయూ చేపట్టిన జాతీయ సదస్సు రెండో రోజు(ముగింపు) సదస్సులో ఓయూ జెనెటిక్స్ అండ్ బయోటెక్నాలజీ ప్రొ.రోజా రాణి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. క్రిస్పర్ టెక్నాలజీ వంటి ఆధునిక విధానాలు వైద్య, వ్యవసాయ రంగాల్లో జన్యు పరిణామాలు, జన్యు సర్దుబాటు వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. డా.సుమలత పలు అంశాలపై ప్రసంగించారు. కన్వీనర్ డా.ప్రసన్న షీలా, ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్మయి పాల్గొన్నారు.


