News February 12, 2025
NZB: ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన ఎమ్మెల్సీ కవిత
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739274336261_50139228-normal-WIFI.webp)
కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజా క్షేత్రంలో పోరాటాలు చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. మహిళా దినోత్సవంలోగా హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని అల్టిమేటం జారీ చేశారు. కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట వేశామని, కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలను చిన్నచూపు చూస్తున్నారన్నారు.
Similar News
News February 12, 2025
NZB: తాళం వేసిన ఇంట్లో చోరీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739335857813_50139228-normal-WIFI.webp)
ఇంటికి తాళం వేసి కుటుంబం కుంభమేళాకు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళం పగులగొట్టి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన నిజామాబాద్‌లో జరిగింది. కంఠేశ్వర్ బైపాస్ రోడ్‌లో నివాసం ఉండే శేఖర్ కుటుంబంతో కలిసి సోమవారం కుంభమేళాకు వెళ్లారు. కాగా అదే రాత్రి దొంగలు తాళం పగలగొట్టి ఇంట్లోని 2 తులాల బంగారం, 40 వేల నగదు అపహరించినట్లు బాధితుడు తెలిపారు.
News February 12, 2025
నిజామాబాద్‌లో ఫొటో జర్నలిస్టు మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739330939752_50486028-normal-WIFI.webp)
నిజామాబాద్‌లో అనారోగ్యంతో సీనియర్ ఫొటో జర్నలిస్టు రమణ మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన పలు వార్త పత్రికల్లో ఫొటోగ్రాఫర్‌గా పనిచేశారు. కాగా ఆయన మృతి పట్ల జర్నలిస్టు సంఘాల నాయకులు, ప్రెస్ క్లబ్ సభ్యులు నివాళులర్పించారు.
News February 12, 2025
NZB: బావిలో పడి బాలుడి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739294889526_1269-normal-WIFI.webp)
నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.