News April 1, 2025
NZB: ప్రభుత్వ తీరుపై MP ఫైర్

HCU భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్పా ఏమీ తెలియదు.. అందుకే హెచ్సీయూ భూములను వేలం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని NSUI కూడా వ్యతిరేకిస్తోందని అన్నారు. భూముల విషయంలో రాహుల్ గాంధీ కమీషన్ తీసుకోకపోతే రేవంత్ ఆపాలని వ్యాఖ్యానించారు.
Similar News
News April 4, 2025
NZB: ఈజీ మనీ కోసం పెడదారి పట్టొద్దు: సీపీ

బెట్టింగ్ ఊబిలోకి వెళ్లి బంగారు భవిష్యత్ను నాశనం చేసుకోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ అనేది మన రాష్ట్రంలో పూర్తిగా నిషేధమన్నారు. ఇన్ప్లూయెన్సర్లు చెప్పారని, సోషల్ మీడియాలో వచ్చిన లింక్లను క్లిక్ చేసి బెట్టింగ్ ఆడవద్దని హితవు పలికారు. ఈజీ మనీ కోసం పెడదారులు పట్టొదన్నారు.
News April 4, 2025
NZB: షబ్బీర్ అలీకి మంత్రి పదవి ఖాయమేనా?

రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న షబ్బీర్ ఆలీకి మంత్రి పదవి దక్కడం ఖాయమని చర్చ జరుగుతోంది. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ మంత్రి వర్గ విస్తరణలో ఒక మైనార్టీ ఉంటారని చేసిన ప్రకటన ఇందుకు ఊతం ఇస్తోంది. ఈ ప్రకటన.. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీల ఎంపికలో చోటు దక్కక నిరాశలో ఉన్న షబ్బీర్ ఆలీతో పాటు ఆయన అనుచరుల్లో మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది.
News April 4, 2025
నిజామాబాద్: దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ జిల్లాలో గ్రామ పాలనాధికారులుగా పని చేయడానికి ఆసక్తి కలిగిన మాజీ వీఆర్ఓలు, వీఆర్ఎలు దరఖాస్తులు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. అర్హత కలిగిన వారు ఈ నెల 16వ తేదీ లోగా గూగుల్ ఫామ్ https://forms.gle/AL3S8r9E2Dooz9Rc7లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాల కోసం https://ccla.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని కలెక్టర్ పేర్కొన్నారు.