News April 1, 2025
NZB: ప్రభుత్వ తీరుపై MP ఫైర్

HCU భూముల వ్యవహారంలో ప్రభుత్వ తీరుపై నిజామాబాద్ MP అరవింద్ ధర్మపురి ఫైర్ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ తప్పా ఏమీ తెలియదు.. అందుకే హెచ్సీయూ భూములను వేలం వేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయాన్ని NSUI కూడా వ్యతిరేకిస్తోందని అన్నారు. భూముల విషయంలో రాహుల్ గాంధీ కమీషన్ తీసుకోకపోతే రేవంత్ ఆపాలని వ్యాఖ్యానించారు.
Similar News
News April 20, 2025
NZB: ‘దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో వరి సాగు’

దేశంలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం సాగు అయ్యిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. 54.89 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు చేయగా.. 137.10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడులు వచ్చాయని వివరించారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 8,329 కొనుగోలు కేంద్రాల ద్వారా 70.13 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్లకు ఆదేశించారు.
News April 19, 2025
NZB: భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి చట్టం: కలెక్టర్

భూ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తూ రైతుల భూములకు పూర్తి భరోసా కల్పించేందుకే ప్రభుత్వం నూతనంగా భూభారతి చట్టం తెచ్చిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భూ భారతిపై శనివారం వర్ని , రుద్రూర్ రైతు వేదికలలో అవగాహన సదస్సులలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడారు. ప్రజల కోసం ప్రత్యేకించి రైతులకు వారి భూములకు సంబంధించి ఏవైనా వివాదాలు ఉంటే వాటిని పరిష్కరించుకోవచ్చన్నారు.
News April 19, 2025
NZB: సన్న బియ్యం లబ్ధిదారులతో మైనారిటీ కమిషన్ ఛైర్మన్ భోజనం

నిజామాబాద్ గౌతంనగర్‌లో సన్న బియ్యం లబ్ధిదారుడైన లింబాద్రి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్ తారిఖ్ అన్సారీ శనివారం సన్న బియ్యంతో వండిన అన్నంతో సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారుడిని, కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేస్తుండడం పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.