News September 28, 2024
NZB: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో నిద్రించిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి నిద్రించారు. రాత్రి రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, రోజువారీ దినచర్య, మెనూ, స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News February 28, 2026
నవీపేట్: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.