News November 9, 2024

NZB: ప్రముఖ కవి రచయిత మేక రామస్వామి మృతి

image

ప్రముఖ కవి, రచయిత, క్లాసిక్ సినిమా క్లబ్ వ్యవస్థాపకుడు మేక రామస్వామి(92) శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కళా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఆయన కవిత్వాలు, రచనలు చేశారు. సినిమా రంగంపై ఆసక్తితో క్లాసిక్ సినిమా క్లబ్ నెలకొల్పి పలు రచనలు, సినిమా ప్రదర్శనలు ప్రదర్శించారు. ఇందూర్ భారతికి సైతం ఆయన పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు కవులు రచయితలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News December 12, 2025

NZB: సర్పంచిగా గెలిచాడు.. అంతలోనే విషాదం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొంది సంబరాలు చేసుకుంటున్న సమయంలో సర్పంచి తల్లి మృతి చెందింది. రుద్రూర్ మండలం రాణంపల్లి సర్పంచిగా కే.శంకర్ గెలుపొందాడు. గురువారం రాత్రి విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఆయన తల్లి లింగవ్వకు ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

News December 12, 2025

నిజామాబాద్ జిల్లాలో 7.3°C అత్యల్ప ఉష్ణోగ్రత

image

NZB జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో సాలుర 7.3°C, చిన్న మావంది 7.6, కోటగిరి 8.3, జకోరా, గోపన్నపల్లి 8.9, పొతంగల్ 9, కల్దుర్కి 9.2, మదన్ పల్లె 9.5, చందూర్, మంచిప్ప 9.6, బెల్లాల్ 9.7, డిచ్‌పల్లి, మోస్రా 9.8, ఎడపల్లి, మెండోరా, రుద్రూర్ 9.9, నవీపేట్, పాల్దా, నిజామాబాద్, గన్నారం 10°C ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

News December 12, 2025

NZB: నేటి నుంచి నిషేధాజ్ఞలు: CP

image

ఈ నెల 14 న నిజామాబాద్ డివిజన్‌లో నిర్వహించనున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా శాంతి భద్రతల నిర్వహణ కోసం శుక్రవారం నుంచి 163 BNSS ఉత్తర్వులు జారీ చేసినట్లు CPసాయి చైతన్య తెలిపారు. NZB డివిజన్‌లోని నిజామాబాద్ రూరల్, మాక్లూర్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, జక్రాన్ పల్లి, ధర్పల్లి, మోపాల్, సిరికొండ మండలాల్లో రెండో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పోలింగ్ జరిగే ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు ఉంటాయన్నారు.