News February 12, 2025

NZB: ప్రయోగ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన DIEO

image

నిజామాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో రెండో దశ చివరి రోజు ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాలను బుధవారం DIEO రవికుమార్ తనిఖీ చేశారు. ప్రయోగ పరీక్షలు జరుగుతున్న పలు ప్రైవేటు కళాశాలలు, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో కెమెరాలు పని చేస్తున్న విషయాన్ని స్వయంగా DIEO పరిశీలించారు.

Similar News

News March 28, 2025

NZB: సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలి: పోచారం

image

వర్ని మండలం సిద్ధాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్ధాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం నగరంలోని ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. కొనసాగుతున్న పనులపై ఆరా తీశారు.

News March 28, 2025

NZB: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ

image

NZB నగర శివారులో ఓ మహిళ దారుణ హత్యకు గురైనట్లు తెలిసింది. మహిళ మృతదేహాన్ని కారు డిక్కీలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మృతురాలు కమలగా పోలీసులు గుర్తించారు. కంఠేశ్వర్ బైపాస్ వద్ద మహిళను హత్య చేసి, మాక్లూర్‌లోని దాస్ నగర్ కెనాల్‌లో పడేసేందుకు కారు డిక్కీలో మృతదేహాన్ని తరలిస్తుండగా పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 28, 2025

NZB: నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు: డీఈవో

image

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ఒంటి పూట బడుల నేపథ్యంలో రెండు పూటల బడులు నిర్వహించే పాఠశాలల పై ఎటువంటి నోటీసులు లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ నోటీస్ జారీ చేశారు. జిల్లాలో పలు ప్రైవేటు విద్యాసంస్థలు వేసవి కాలంలో రెండు పూటలు బడులు నిర్వహిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు సంబంధిత ప్రైవేటు యాజమాన్యాలకు ఆయన సూచనలు చేశారు.

error: Content is protected !!