News April 14, 2025
NZB: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.
Similar News
News October 19, 2025
రైఫిల్ షూటింగ్లో సత్తా చాటిన ఆర్మూరు FBO సుశీల్

అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 8వ రాష్ట్ర స్థాయి క్రీడ పోటీలో ఆర్మూరు రేంజ్ FBO బాస సుశీల్ కుమార్ ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్-అక్టోబర్ నెలలో రాష్ట్ర సాయి పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా బాసర జోన్ లెవెల్లో నిర్వహించిన మెన్స్ రైఫిల్ షూటింగ్లో మొదటి విజేతగా సుశీల్ నిలిచారు. అలాగే హైదరాబాదులోని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో ఈనెల 18న రాష్ట్రస్థాయి పోటీల్లో 2వ విజేతగా నిలిచి సిల్వర్ మెడల్ సాధించారు.
News October 19, 2025
నిజామాబాద్: 3,500 ఎకరాలల్లో ఆయిల్ పామ్ సాగు: కలెక్టర్

లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ సాగు జరిగేలా కృషి చేయాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా వ్యాప్తంగా 3,500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యం దిశగా రైతులను ప్రోత్సహించాలన్నారు. కలెక్టరేట్‌లో శనివారం వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు, ఆయిల్ పామ్ నర్సరీని నిర్వహిస్తున్న కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగుకు తగు సూచనలు చేశారు.
News October 19, 2025
నిజామాబాద్: ధాన్యాన్ని వెంటనే అన్‌లోడింగ్ చేసుకోవాలి: కలెక్టర్

కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం నిల్వలను రైస్ మిల్లుల వద్ద వెంటనే అన్ లోడింగ్ చేసుకునేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. ధాన్యం దిగుమతి చేసుకున్న వెంటనే ట్రక్ షీట్లు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రుద్రూర్, పొతంగల్, కోటగిరి మండలం కొత్తపల్లిలో ఐకేపీ కొనుగోలు కేంద్రాలను శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్‌తో కలిసి తనిఖీ చేశారు.