News April 14, 2025

NZB: ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలి: షబ్బీర్ అలీ

image

ప్రాణహిత-చేవెళ్ల ప్యాకేజీ-22 పనులు చేపట్టాలని, భూసేకరణ నిధులు వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోరారు. ఆదివారం ఎర్రమంజిల్‌లోని జలసౌధలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి NZB జిల్లాకు చెందిన రిజర్వాయర్, ప్రాజెక్టుల పెండింగ్ పనులు, మరమ్మత్తులపై మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సానుకూలంగా స్పందించినట్లు షబ్బీర్ అలీ పేర్కొన్నారు.

Similar News

News April 12, 2026

NZB: చర్చనీయంగా జీవన్ రెడ్డి వ్యాఖ్యలు

image

కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి కారు ఎక్కడం ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో సంచలనంగా మారింది. దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు అండగా ఉన్న ఆయన, సొంత పార్టీ నేతల వైఖరితో విసిగిపోయి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. ​గులాబీ కండువా కప్పుకున్న అనంతరం ఉమ్మడి జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్, గతంలో పోచారంపై ఆయన విమర్శల వర్షం కురిపించారు. దీంతో ఇక్కడి నేతలు జీవన్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు.

News April 11, 2026

కందకుర్తి: బహిరంగ సభలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యేలు

image

రెంజల్ మండలం కందకుర్తిలో శనివారం నిర్వహించిన బహిరంగ సభలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పల్ సూర్యనారాయణ, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ పాల్గొన్నారు. ప్రజల మధ్యలోనే ఉండి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ రావ్ భగవత్ సందేశాన్ని ఆసక్తిగా వీక్షించారు.