News May 23, 2024

NZB: ఫలితాలకు ఇంకా 13 రోజులే

image

ఈ నెల 13న జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన నేతల్లో ఉత్కంఠ నెలకొంది. ఆభ్యర్థులుగా పోటీ చేసిన వారే కాకుండా పార్టీల గెలుపు కోసం నిరంతరం కృషి చేసిన నాయకులు సైతం ఎన్నికల రిజల్ట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ సారి గెలుపుపై ప్రధాన పార్టీల నేతలు గట్టిగానే ఆశలు పెట్టుకున్నారు. ఇంకా 13రోజులే ఉండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ మెదలైంది.

Similar News

News November 19, 2025

నిజామాబాద్: 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా

image

నిజామాబాద్‌ డివిజన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన 30 మందిని పోలీసులు పట్టుకున్నారు. వారిని మంగళవారం జిల్లా మార్నింగ్ కోర్టులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ ఎదుట హాజరుపరిచారు. వారిలో 23 మందికి రూ.2.36 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. మరో ఏడుగురికి జైలు శిక్ష పడింది. అంతకు ముందు వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చారు.

News November 19, 2025

NZB: స్వాధార్ గృహంలో సౌకర్యాలు మెరుగుపరచాలి: సబ్ కలెక్టర్

image

బోధన్ పట్టణంలోని స్వాధార్ గృహంను సబ్ కలెక్టర్ వికాస్ మహతో మంగళవారం జిల్లా సంక్షేమ అధికారి, సీడీపీవోలతో కలిసి సందర్శించారు. నివాసితుల వసతి, పరిశుభ్రత, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను తెలుసుకున్నారు. తక్షణమే సౌకర్యాలు మెరుగుపరచాలని సంబంధిత అధికారులకు ఆయన సూచనలు జారీ చేశారు.

News November 18, 2025

నిజామాబాద్: చలికాలం.. CP జాగ్రత్తలు..!

image

చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో వాహనదారులు పొగమంచు పడుతున్న సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిజమాబాద్ సీపీ సాయి చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వాహనదారులు తక్కువ వేగం, హై బీమ్ లైట్ కాకుండా లో బీమ్ లైట్లు, రేడియం స్టిక్కర్స్ తదితర నిబంధనలు పాటించాలన్నారు. రహదారులపై ప్రమాదాలను నివారించేందుకు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా జాగ్రతలు పాటించాలని ఆయన కోరారు.