News January 13, 2025
NZB: బడా పహాడ్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లాలోని బడా పహాడ్ దర్గాను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సాయంత్రం సందర్శించారు. దర్గాకు సందల్‌తో కూడిన చాదర్ సమర్పించారు. ఈ సందర్భంగా ఆమెకు బడాపహాడ్ దర్గా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికి దర్గా వద్ద ప్రార్థనలు జరిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు, సుమిత్రా ఆనంద్, అయేషా ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్‌కు జిల్లా వాసులు

ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ఈ నెల 15 నుంచి 28 వరకు కాకినాడలో జరుగునుంది. ఈ టోర్నమెంట్‌కు జిల్లాకు చెందిన వ్యాయామ ఉపాధ్యాయులు జాకోర ZPHSకు చెందిన PET స్వామి కుమార్, డిచ్పల్లి ZPHSకు చెందిన PET స్వప్న రాష్ట్ర జట్టుకు సారథులుగా ఎంపికైయ్యారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ , SGF కార్యదర్శి నాగమణి వారిని అభినందించారు.
News February 13, 2025
NZB: నేషనల్ కబడ్డీ ప్రాబబుల్స్‌లో జిల్లా క్రీడాకారులు

జాతీయస్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారులు రాష్ట్ర జట్టు ప్రాబబుల్స్ జాబితాకు ఎంపికయ్యారు. పురుషుల జట్టులో సుశాంక్, శ్రీనాథ్, మహిళల జట్టులో గోదావరి జాతీయ సన్నద్ధ శిబిరంలో శిక్షణ పొందుతున్నారు. అనంతరం వారి ప్రతిభ నైపుణ్యత ఆధారంగా ఒడిశాలో జరిగే పురుషుల, హర్యాణాలో జరిగే మహిళల సీనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
News February 13, 2025
ముప్కాల్: హైవేపై యాక్సిడెంట్ వ్యక్తి మృతి

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలోని వేంపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవేపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వయసు సుమారు 50-60 మధ్యలో ఉంటుంది. అతను తెల్ల చొక్కా లుంగీ ధరించి ఉన్నాడు. వివరాలు తెలిస్తే ముప్కాల్ పోలీస్ స్టేషన్‌లో సమాచారం అందించలన్నారు.