News June 3, 2024

NZB: బడిబాట కార్యక్రమం వాయిదా

image

నిజామాబాద్ విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 3న తలపెట్టిన బడిబాట కార్యక్రమం వాయిదా పడింది. ఉన్నతాధికారుల సూచన మేరకు వాయిదా వేస్తునట్లు జిల్లా విద్యాశాఖ అధికారి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. బడిబాట కార్యక్రమ వివరాలు త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాల పెద్ద సంఖ్యలో చేర్చాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామన్ని తిరిగి ప్రారంభిస్తామని డీఈవో తెలిపారు.

Similar News

News September 8, 2024

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ 9 గేట్లు ఓపెన్

image

నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో ప్రాజెక్టు నిండటంతో శనివారం రాత్రి 9 గేట్లను ఓపెన్ చేశారు. 52,013 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకి ఇన్ ఫ్లోగా అంతే మొత్తంలో క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగుల (80.5TMC)కు గాను, తాజాగా 1,088.9 అడుగుల (80.053TMC) నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

News September 8, 2024

బాన్సువాడ: విఘ్నేశ్వరుడికి పూజ చేసిన రాష్ట్ర ఆగ్రో ఛైర్మన్

image

కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని శ్రీ రామ మందిరంలో వినాయక చవితి సందర్భంగా తెలంగాణ అగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాల్ రాజ్ విగ్నేశ్వరుడికి శనివారం సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరి విజ్ఞాలు తొలగి వినాయకుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ రెడ్డి, ప్రదీప్, రమాకాంత్ పాల్గొన్నారు.

News September 7, 2024

NZSR: స్వీయ చిత్రం మోజు.. ప్రమాదం అంచున ఫోజు..!

image

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజాంసాగర్ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన నీటిని వదిలారు. ప్రకృతి అందాలను వీక్షించేందుకు సందర్శకులు ఇక్కడికి భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. సెల్ఫీ, ఫోటోలు తీసుకునే క్రమంలో ప్రమాదాన్ని గ్రహించడం లేదు. ఏదైనా నష్టం జరిగితే ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఎలాంటి ప్రమాదం జరగక ముందే పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.