News February 2, 2025
NZB: బడ్జెట్పై కాంగ్రెస్ మతిలేని మాటలు: ఎమ్మెల్యే
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై కాంగ్రెస్ నాయకులు మతిలేని మాటలు మాట్లాడుతున్నారని బీజేపీకి చెందిన నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. సబ్కా సాత్ సబ్కా వికాస్ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పేదరిక నిర్మూలన కోసం, పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అన్ని రాష్ట్రాల మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా బడ్జెట్ను రూపొందించినట్లు పేర్కొన్నారు.
Similar News
News February 3, 2025
NZB: జిల్లా జైలును సందర్శించనున్న DG సౌమ్య మిశ్రా
నిజామాబాద్ జిల్లాలోని సారంగపూర్లో ఉన్న జిల్లా జైలును సోమవారం జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ (DG) సౌమ్య మిశ్రా సందర్శించనున్నట్లు జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. ఉదయం జిల్లా జైలుకు వచ్చే ఆమె అక్కడ పరిశీలించి అనంతరం మీడియాతో మాట్లాడతారని అధికారులు వివిరించారు. కాగా ఆమె పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
News February 2, 2025
NZB: దిల్ రాజుకు ఆహ్వానం
నిజామాబాద్లో వారాహి అమ్మవారి ఆలయ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని కోరుతూ ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు ఆదివారం వారాహి మాత ఆలయ కమిటీ ఛైర్మన్ డాక్టర్ మంచాల జ్ఞానేందర్ గుప్తా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా జ్ఞానేందర్ గుప్తా మాట్లాడుతూ.. ఈ నెల 10న ఆలయ శంకుస్థాపన నిర్వహిస్తున్నామని వివరించారు.
News February 2, 2025
లింబాద్రి గుట్ట స్వామిని దర్శించుకున్న శ్రీముఖి
భీమ్గల్ మండలం లింబాద్రి గుట్ట లక్ష్మీ నరసింహ స్వామిని ప్రముఖ టీవీ యాంకర్ శ్రీముఖి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. గర్భాలయంలో స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ పూజారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు ఆమెకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెను శాలువాతో సన్మానించారు. ఆలయానికి వచ్చిన భక్తులు ఆమెతో ఫొటోలు దిగడానికి ఉత్సాహం చూపారు.