News January 16, 2025
NZB: బస్తీ దవాఖానాలను తనిఖీ చేసిన DMHO

ఖానాపూర్, నాగారం బస్తీ దవాఖానాలను బుధవారం జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ అధికారిణి రాజశ్రీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాధినిరోధక టీకాల కార్యక్రమాన్ని ఇతర వైద్య సేవలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ.. ప్రతి ఆశ కార్యకర్త డ్యూలిస్టును మెయింటైన్ చేస్తూ ఒకరోజు ముందే టీకాలు ఎవరికి ఇవ్వాలో వారిని బస్తీ దవాఖానాలకు వచ్చేలా చూడాలన్నారు.
Similar News
News November 27, 2025
NZB: శుభముహూర్తం చివరి రోజు.. భారీ నామినేషన్లకు అవకాశం!

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల్లో ఈసారి సర్పంచ్‌గా నిలబడి గ్రామానికి సేవ చేయాలనే ఆశతో ఎన్నో ఏళ్లుగా పూజలు, వ్రతాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న స్థానిక నాయకుల్లో నామినేషన్ ఉత్సాహం ఉప్పొంగుతోంది. మొదటి విడత 184 గ్రామ పంచాయితీల్లో ఎన్నికలకు గురువారం శుభముహూర్తం చివరి రోజు కావడం, రేపటి నుంచి మూఢాలు ప్రారంభం అవుతున్న క్రమంలో నేడు భారీ సంఖ్యలో నామినేషన్లు నేడే వేసే అవకాశాలు ఉన్నాయి.
News November 27, 2025
నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు: కలెక్టర్

నిబంధనలు పాటించని వడ్డీ వ్యాపారులకు జరిమానాలు విధించినట్లు కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం తెలిపారు. మనీ లెండర్స్ యాక్ట్ కేసులను అనుసరిస్తూ నిజామాబాద్ నగరానికి చెందిన ఐదుగురు వడ్డీ వ్యాపారులకు రూ. 25 వేల నుంచి రూ. 50 వేల వరకు జరిమానాలు విధించామని వివరించారు. మొదటి తప్పుగా గుర్తించి సాధారణ జరిమానాలు మాత్రమే విధించినట్లు పేర్కొన్నారు.
News November 27, 2025
నవీపేట: మహిళకు లిఫ్ట్ ఇచ్చి బంగారం చోరీ.. వ్యక్తి అరెస్ట్

నందిగాం గ్రామ శివారులో ఈనెల 19న మహిళను బెదిరించి బంగారం దోపిడీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్ఐ తిరుపతి తెలిపారు. నందిగామ్‌కు చెందిన గంగమణికి ఓ వ్యక్తి లిఫ్ట్ ఇచ్చి బైక్ పై తీసుకెళ్లాడు. అనంతరం బెదిరించి 2 తులాల తాళి, ఫోన్ దోచుకుని పారిపోయాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చసి సీసీ కెమరాలు, కాల్ డేటా ఆధారంగా నిందితుడు పట్లోల శ్రీకాంత్‌ను అరెస్టు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.


