News July 9, 2024

NZB: బాయ్స్ హాస్టల్‌లో యువతి.. విద్యార్థి సస్పెండ్

image

బాయ్స్ హస్టల్‌లో యువతికి ఓ స్టూడెంట్ 15రోజుల క్రితం ఆశ్రయమిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్సిటీ అధికారుల వివరాలిలా.. టీయూలో విద్యార్థి పీజీ చదువుతూ యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్నాడు. అతను ఓ యువతికి ఆశ్రయమిచ్చిన విషయాన్ని తోటి విద్యార్థులు వార్డెన్‌ దృష్టికి తీసుకెళ్లారు. అధికారులు ఆ స్టూడెంట్‌ని  సస్పెండ్ చేశారు.

Similar News

News December 1, 2025

నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

image

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సోమవారం ఆయన జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

News December 1, 2025

NZB: పార్లమెంట్ సమావేశాలు… MP స్టాండ్ ఏమిటి?

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో NZB MPఅర్వింద్ ధర్మపురి ఏం మాట్లాడతారోనని పార్లమెంట్ పరిధి వాసులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ముఖ్యంగా 500 బెడ్‌ల ESI ఆసుపత్రి నిర్మాణం, పార్లమెంట్ పరిధిలో మూతపడిన చక్కెర ఫ్యాక్టరీల ఓపెనింగ్, అంశాలను పార్లమెంట్ వేదికగా కేంద్రం దృష్టికి MP తీసుకెళ్తారా లేదా అన్నది వేచిచూడాల్సి ఉంది.

News December 1, 2025

NZB: 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు

image

NZB జిల్లాలో సోమవారం నుంచి కొత్త మద్యం దుకాణాలు ప్రారంభంకానున్నయి. రెండేళ్ల కాల పరిమితితో జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారులు గత నెలలో 102 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. మద్యం దుకాణాలకు 2,786 మంది దరఖాస్తులు చేసుకోగా ఎక్సైజ్ శాఖకు రూ.83.58 కోట్ల ఆదాయం వచ్చింది. అక్టోబర్ 27 తేదీన 102 దుకాణాలకు లాటరీ పద్ధతిన లక్కీడ్రా తీశారు. ఇందులో 19 మంది మహిళలకు కొత్త మద్యం దుకాణాలు దక్కడం విశేషం.