News April 3, 2024
NZB: బాలికకు లైంగిక వేధింపులు.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు

విద్యార్థినిపై లైంగిక వేధింపులకు దిగిన ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం శెట్పల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన 9తరగతి విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ శర్మ లైంగిక వేధించసాగాడు. సదరు బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు వివరించింది. వారు షీ టీంను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన షీటీం విచారణ చేపట్టి ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేసింది.
Similar News
News October 24, 2025
NZB: 138 పేకాట కేసుల్లో 599 మంది పట్టివేత:CP

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దీపావళి పండుగ సందర్భంగా ఈనెల 19 నుంచి 22 వరకు 138 పేకాట కేసులు నమోదు చేసి 599 మందిని పట్టుకున్నట్లు CP సాయి చైతన్య గురువారం తెలిపారు. ఈ కేసుల్లో రూ. 14,15,917 నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. NZBడివిజన్లో 42 కేసులు, ARMRడివిజన్లో 44 కేసులు, బోధన్ డివిజన్ లో 52 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.
News October 23, 2025
సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టాలి: కవిత

తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష నియామకాల్లో టీజీపీఎస్సీ… రాష్ట్రపతి ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆర్టికల్ 371-డి ని ఉల్లంఘించిందంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోని విచారించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్కు ఆమె లేఖ రాశారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తెలంగాణ అభ్యర్థులకు అన్యాయం చేసిందన్నారు.
News October 23, 2025
రాష్ట్రస్థాయి పోటీల్లో NZB క్రీడాకారులకు మెడల్స్

రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో HYDలో నిర్వహించిన అండర్ 19 రెజ్లింగ్ పోటీల్లో NZB క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ కనబరిచిన 2 గోల్డ్ మెడల్స్ 3 రజత పథకాలు సాధించారని కోచ్ సంతోష్ తెలిపారు. సఫీయా 76kg విభాగంలో కృష్ణ 65KG విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారన్నారు. మెడల్స్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.


