News February 12, 2025
NZB: బావిలో పడి బాలుడి మృతి

నిజామాబాద్ జిల్లాలో ఓ బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందిన ఘటన మంగళవారం ఇందల్వాయి మండలం డొంకల్ తండాలో చోటుచేసుకుంది. తండాకు చెందిన లక్ష్మణ్(13) మరో ఇద్దరితో కలిసి మేకలు కాయడానికి గ్రామ శివారులోకి వెళ్లారు. బావిలో నీటిని తాగడానికి వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబీకులు వెళ్లి చూసేసరికి లక్ష్మణ్ మృతి చెందినట్లు వెల్లడించారు.
Similar News
News March 25, 2025
సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి!

మంత్రివర్గ విస్తరణలో భాగంగా బోధన్ MLAకు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కాగా MLC మహేశ్ కుమార్ గౌడ్‌కు PCC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే BSWDకి చెందిన కాసుల బాల్‌రాజ్‌కు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమించింది. బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌కు టీజీఎండీసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవీ దక్కలేదు. జిల్లాకు అమాత్య యోగముందా కామెంట్ చేయండి.
News March 25, 2025
నిజామాబాద్: తగ్గిన ఎండ తీవ్రత..

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. సోమవారం మంచిప్పలో 38.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కమ్మర్పల్లిలో 38.7℃, కోటగిరి 38.6, లక్మాపూర్ 38.5, మల్కాపూర్, ఎడపల్లి, గోపనపల్లె 38.4, ధార్పల్లి, మోర్తాడ్ 38.3, పెర్కిట్, వైల్‌పూర్, కోనసమందర్, ఎర్గట్ల 38.2, మోస్రా, భీంగల్, మెండోరా 38.0, ఆలూర్ 37.8, ముప్కల్, బాల్కొండ 37.7, నిజామాబాద్ 37.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.
News March 25, 2025
BJP స్టేట్ చీఫ్‌గా ఎంపీ అర్వింద్?

ఉగాదిలోపు తెలంగాణ బీజేపీకి కోత్త అధ్యక్షుడిని నియమిస్తారనే ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లో ఊపందుకుంది. రెండు రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది. అయితే బీసీ నేతను నియమిస్తారా.. లేక ఓసీకి దక్కుతుందా అనే దానిపై సందిగ్ధత నెలకొంది. కాగా పరిశీలనలో ఎంపీ ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్ ముందువరసలో ఉన్నట్లు తెలిసింది. డీకే అరుణ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం.