News August 20, 2024
NZB: బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో చోరీ.. అరెస్ట్
బాసర సరస్వతి ఆలయంలో చోరికి పాల్పడ్డ నిందితుడు పోలీసులకు పట్టుబడ్డాడు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ జానకిషర్మిల వివరించారు. ఆర్మూర్‌కు చెందిన సాయికుమార్ నవీపేటలో నివాసం ఉంటున్నాడు. మద్యానికి అలవాటు పడిన అతను చోరీ చేయాలని అనుకొని బుధవారం రాత్రి బాసరకు చేరుకున్నాడు. ఆర్థరాత్రి ఆలయంలో చొరబడి, హుండీ పగలగొట్టి రూ. 14,200 కాజేశాడు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.
Similar News
News September 17, 2024
ఎల్లారెడ్డి: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
కామారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకొంది. ఎల్లారెడ్డి మండలం లింగారెడ్డిపేటలో ప్రమదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుజ్జిగారి ఏశయ్య(25) స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని పటేల్ చెరువులో వినాయక నిమజ్జనానికి వెళ్లాడు. కాగా ప్రమాదవశాత్తు చెరువులో పడి ఈత రాక మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News September 17, 2024
కామారెడ్డిలో రికార్డు స్థాయి ధర పలికిన లడ్డూ
కామారెడ్డిలో వినాయకునికి లడ్డూ రికార్డు ధర పలికింది. కామారెడ్డి హౌసింగ్ బోర్డులోని సంకష్ఠ గణపతి దేవాలయంలో నిర్వాహకులు లడ్డూ వేలం పాట నిర్వహించారు. కాగా జీఆర్ఎల్ సంస్థ ప్రతినిధి సంతోష్ రూ.2.79 లక్షలకు లడ్డూను వేలం పాటలో దక్కించుకున్నారు.
News September 17, 2024
NZB: వినాయక నిమజ్జనం.. కావొద్దు విషాదం..!
వినాయక చవితి సందర్భంగా 11 రోజుల పాటు పూజలు అందుకున్న లంబోదరుడు రేపు గంగమ్మ ఒడిలోకి చేరనున్నాడు. అయితే వినాయకుడికి గంగమ్మ చెంతకు తీసుకెళ్లే క్రమంలో.. చిన్నపాటి నిర్లక్ష్యం భక్తుల ప్రాణాల మీదకు తెస్తోంది. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రతీ ఏటా ఉమ్మడి NZB జిల్లాలో నిమజ్జనం సమయంలో అపశృతులు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఏటా వినాయక నిమజ్జనం విషాదం కాకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ..గణేష్ నిమజ్జనం చేద్దాం.