News July 15, 2024

NZB: బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే

image

నిజామాబాద్ నగర బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నగరంలో శ్రావ్య గార్డెన్‌లో దినేష్ కులాచారి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ ధర్మపురి అరవింద్, ఇందూర్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హాజరై వారు మాట్లాడుతూ.. నిజామాబాదు అసెంబ్లీ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో కష్టపడి పడి పనిచేసి ఇందూర్ గడ్డ‌పై కాషాయ జెండా ఎగుర వేసిన కార్యకర్తలకే ఈ విజయం దక్కుతుందన్నారు.

Similar News

News February 22, 2026

NZB: రెండు వారాల్లో 134 DD కేసులు :CP

image

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గడిచిన రెండు వారాల్లో 134 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య శనివారం తెలిపారు. 134 మందిని కోర్టుల్లో హాజరు పరచగా రూ 12.10 లక్షల జరిమానా విధించడం జరిగిందన్నారు. అలాగే 13 మందికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారని CP వివరించారు.

News February 22, 2026

NZB: NAC ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

image

NAC ఆధ్వర్యంలో నిరుద్యోగ మైనార్టీ యువత కోసం ల్యాండ్ సర్వేలో 3 నెలల ఉచిత శిక్షణ ఇస్తామని NZB అసిస్టెంట్ డైరెక్టర్ లింబాద్రి తెలిపారు. ఈ శిక్షణ ఈనెల 27 నుంచి ప్రారంభమవుతుందన్నారు. 18-35 సంవత్సరాలలోపు ఉండాలన్నారు. ఇంటర్మీడియట్, లేదా ITI సివిల్ చదివినవారు అర్హులన్నారు. వీరికి స్టేషనరీ, యూనిఫామ్ ఉచితం అని, గ్యారెంటీ ప్లేస్మెంట్ కల్పిస్తామన్నారు.