News July 12, 2024

NZB: బీజేపీ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ అరవింద్

image

బిజెపి విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన శంషాబాద్‌లోని ఓ కన్వెన్షన్‌లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కాగా నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పాల్గొన్నారు.

Similar News

News December 2, 2025

NZB: రెండో రోజూ 1,661 నామినేషన్లు

image

నిజామాబాద్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్‌లు ఊపందుకున్నాయి. ధర్పల్లి, డిచ్‌పల్లి, ఇందల్వాయి, మాక్లూర్, మోపాల్, NZBరూరల్, సిరికొండ, జక్రాన్ పల్లి మండలాల్లో రెండో రోజైన సోమవారం 196 సర్పంచి స్థానాలకు 456, 1760 వార్డు స్థానాలకు 1,205 నామినేషన్లు దాఖలయ్యాయి. దీనితో రెండు రోజుల్లో కలిపి సర్పంచ్ స్థానాలకు 578, వార్డు స్థానాలకు 1,353 నామినేషన్లు దాఖలు అయినట్లు అధికారులు వివరించారు.

News December 1, 2025

జీజీ కళాశాలలో మొదటి సెమిస్టర్ డిగ్రీ పరీక్షలు ప్రశాంతం

image

జి.జి.కళాశాలలో శనివారం నుండి మొదలైన (స్వ.ప్ర.) డిగ్రీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్ లాగ్ పరీక్షలు సోమవారం కూడా ప్రశాంతంగా జరిగాయి. సోమవారం1664 మంది విద్యార్థులకుగాను 57మంది గైర్హాజరయ్యారు.1607మంది విద్యార్థులు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, తదితర పరీక్షలకు హాజరైనట్లు కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ డా.ఎస్ రంగరత్నం, పరీక్షల నియంత్రణ అధికారి భరత్ రాజ్, అకాడమిక్ కోఆర్డినేటర్ నహీద బేగం తెలిపారు.

News December 1, 2025

నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్

image

నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని, ఎలాంటి తప్పిదాలకు తావు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీ రెండవ విడత ఎన్నికల సన్నాహాల్లో భాగంగా సోమవారం ఆయన జక్రాన్‌పల్లి మండలం పడకల్ గ్రామ పంచాయతీని ఆకస్మికంగా సందర్శించారు. చివరి రోజున ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.