News April 18, 2025

NZB: బెస్ట్ ఎన్విరాన్మెంటల్ పెర్ఫార్మన్స్ అవార్డులకు దరఖాస్తులు

image

ప్రపంచ పర్యావరణ దినోత్సవం(జూన్5) సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డ్ ఆధ్వర్యంలో పర్యావరణ కార్యక్రమాలు చేపడుతున్న పాఠశాలలకు Best Environmental Performance Awards ప్రదానం చేయనున్నారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలు వారు నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ చర్యల ప్రతిపాదనలు డాక్యుమెంటేషన్ ఫోటోగ్రాఫ్లతో ఈనెల25లోగా జిల్లా సైన్స్ అధికారికి 9848219365 వాట్సాప్ ద్వారా పంపాలని గంగాకిషన్ కోరారు.

Similar News

News April 20, 2025

రాజంపేట: ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

image

రాజంపేటలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. గుడి తండాకి చెందిన మాలోత్ అనిత, గణేశ్‌ల చిన్న కుమారుడు చిన్నా శనివారం సాయంత్రం ఇంటి ముందు స్నేహితులతో కలసి ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ట్రాక్టర్ గేర్లను మార్చగా న్యూట్రల్‌లోకి వెళ్లింది. వెనక పల్లంగా ఉండటంతో ట్రాక్టర్ టైర్ చిన్నాపై నుంచి వెళ్లింది. గాయపడిన చిన్నాను కామారెడ్డి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 20, 2025

పోతంగల్: కొడుకు పెళ్లి.. తండ్రి మృతి

image

తెల్లవారితే కొడుకు పెళ్లి ఉండగా రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి చెందాడు. రుద్రూర్‌కు చెందిన నాగయ్య(52) తన కొడుకు పెళ్లి పత్రికలు ఇచ్చేందుకే శనివారం పోతంగల్‌లోని కారేగాంకు బైక్ పై వెళుతుండగా హంగర్గ ఫారం వద్ద అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి చెట్టును ఢీకొట్టాడు. అతడు తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News April 20, 2025

నిజామాబాద్: గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

image

నందిపేట్ మండల పరిధిలోని అన్నారం గ్రామానికి చెందిన పొగరు రవి కిరణ్ ఫిర్యాదుపై నిజామాబాద్ జిల్లా సీపీ సాయి చైతన్య స్పందించారు. గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి చీటింగ్, ఇమిగ్రేషన్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి పలు గ్రామాలకు చెందిన సుమారు 80 మందిని ముఠా సభ్యులు మోసం చేసినట్లుగా గుర్తించినట్లు సీపీ పేర్కొన్నారు.

error: Content is protected !!