News April 6, 2024

NZB: భానుడి భగ భగ.. అత్యధికంగా ఇక్కడే

image

ఉమ్మడి NZB జిల్లా రోజు రోజుకు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. మధ్యాహ్నం వేళ జిల్లా కేంద్రాలతో పాటు ముఖ్య పట్టణాల్లోని ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నేడు NZB జిల్లా డిచ్పల్లి (మం) కొరట్పల్లిలో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. KMR జిల్లా నిజాంసాగర్ (మం) హాసన్ పల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మున్ముందు ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.

Similar News

News January 12, 2025

పిట్లం: ఏటీఎం ధ్వంసం చేసి చోరీ

image

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని వారు తెలిపారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News January 12, 2025

NZB: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి

image

నిజామాబాద్‌లో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మోస్రాకు చెందిన పీర్ సింగ్(35) పని నిమిత్తం తన బైక్‌‌పై నిజామాబాద్‌కు వచ్చాడు. వర్ని చౌరస్తా వద్ద ఎదురెదురుగా వస్తున్న మరో బైక్‌ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పీర్ సింగ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఐదో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News January 12, 2025

NZB: ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారు చోరీ

image

నిజామాబాద్‌లో ఇంటి ముందు పార్కింగ్ చేసిన కారును దుండగులు చోరీ చేసినట్లు శనివారం మూడో టోన్ ఎస్‌ఐ హరిబాబు తెలిపారు. ఆయన వివరాలు.. గౌతమ్ నగర్‌కు చెందిన పవన్ ఈ నెల 9వ తేదీన తన ఇంటి ముందు కారు పార్క్ చేసి హైదరాబాద్‌కు వెళ్లాడు. మరుసటి రోజు వచ్చి వచ్చే సరికి పార్కింగ్ చేసిన కారు చోరీకి గురైంది. బాధితుడు మూడో టౌన్‌ పోలీసు స్టేషన్‌లో  ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు.