News January 19, 2025
NZB: భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

పురుగులమందు తాగి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు మూడో టౌన్ ఎస్ఐ హరిబాబు తెలిపారు. ఎస్ఐ వివరాల ప్రకారం.. నిజామాబాద్ హమాల్వాడికి చెందిన నాగం సాయికుమార్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. శనివారం ఉదయం భార్యతో గొడవ పడడంతో ఆమె పుట్టింటికి వెళ్ళింది. భార్య లేదని మనస్తాపంతో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News December 4, 2025
ఖమ్మం: ఆహార శుద్ధి రంగంలో నిపుణుల కొరతపై ప్రశ్నించిన ఎంపీ

ఆహార శుద్ధి రంగంలో నైపుణ్య లోటును పూరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ఖమ్మం ఎంపీ రఘునాథరెడ్డి ప్రశ్నించారు. కేవలం మూడు శాతం కార్మికులకు మాత్రమే ప్రత్యేక శిక్షణ ఉన్న నేపథ్యంలో సాంకేతిక వినియోగ వివరాలు తెలపాలని లోక్ సభలో కోరారు. దీనికి కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల సహాయ మంత్రి రవ్ నిత్ సింగ్ బిట్టు లికిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
సర్వర్ మొరాయింపుతో కౌశలం స్కిల్ టెస్టుకు అడ్డంకి.!

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల వేదికగా నిర్వహిస్తున్న కౌశలం (కౌన్సిలింగ్) సర్వేకు సంబంధించిన ఆన్లైన్ స్కిల్ టెస్ట్ ప్రక్రియ సర్వర్ సమస్యల కారణంగా తీవ్ర అంతరాయానికి గురైంది. జిల్లాలోని పలు సచివాలయ కేంద్రాలలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు పరీక్ష కోసం హాజరైన అభ్యర్థులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.
News December 4, 2025
RJY: 13న జాతీయ లోక్ అదాలత్

జిల్లా వ్యాప్తంగా డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి తెలిపారు. గురువారం ఆమె రాజమండ్రిలో మాట్లాడారు. త్వరితగతిన, తక్కువ ఖర్చుతో సామాన్యులకు న్యాయం అందించడమే లోక్ అదాలత్ లక్ష్యమన్నారు. రాజీ పడదగిన కేసులను పరిష్కరించుకునేందుకు కక్షిదారులు ఈ అవకాశాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని కోరారు.


