News March 8, 2025
NZB: భిక్షాటన పేరుతో వచ్చి.. మెడలో గొలుసు చోరీ

భిక్షాటన పేరుతో ఇంట్లోకి చొరబడ్డ ఓ మహిళా ఇంట్లోని వృద్ధురాలి మెడలో నుంచి గొలుసు లాక్కెళ్లిన ఘటన నిజామాబాద్ మండలం గుండారంలో శుక్రవారం జరిగింది. గ్రామానికి లక్ష్మి (70) తన ఇంట్లో ఉండగా గుర్తు తెలియని ఓ మహిళా బిక్షాటన >పేరుతొ లక్ష్మి ఇంట్లోకి వచ్చింది. ఇంట్లో ఎవ్వరూ లేక పోవడంతో ఆమె మెడలో ఉన్న రెండున్నర తులాల గొలుసును లాక్కొని పారిపోయింది. బాధితురాలు నిజామాబాద్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేసిం
Similar News
News November 16, 2025
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి: యూటీఎఫ్

వేతన సవరణ కమిషన్(పీఆర్సీ) రిపోర్టును వెంటనే ప్రకటించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ రాములు డిమాండ్ చేశారు. సూర్యాపేట యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడారు. 2023 జులై 1 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటివరకు అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సోమయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
News November 16, 2025
పార్వతీపురం: ‘సివిల్స్ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్’

UPSC-2026 ప్రిలిమినరీ పరీక్ష కోసం అర్హులైన పేద సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద ఉచిత కోచింగ్ పొందాలనుకునే అభ్యర్థులు నవంబర్ 13 నుంచి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
News November 16, 2025
రైలు ఢీకొని విద్యార్థి మృతి

కడప రైల్వే స్టేషన్లో శనివారం గూడ్స్ రైలు ఢీకొని మహేశ్ (21) MBA విద్యార్థి మృతి చెందినట్లు కడప రైల్వే SI సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు. మహేశ్ పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు ఢీకొట్టడంతో యువకుడు మృతి చెందాడన్నారు. మృతుడు నంద్యాల జిల్లా బనగానపల్లె వాసి అని, కడపలోని అన్నమాచార్య కాలేజీలో చదువుతున్నట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


