News April 30, 2024
NZB: మంత్రాలు చేస్తున్నాడని తండ్రి మీద దాడి చేసిన కొడుకు
మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో తండ్రి మీద ఓ కొడుకు దాడికి పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం ఎన్టీఆర్ నగర్‌లో చోటుచేసుకుంది. తన తండ్రి బుచ్చన్న తరుచూ మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో ఈ నెల 22న కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అతడి కొడుకు మరో 8 మందితో కలిసి పథకం ప్రకారం ఇంటికి వచ్చి దాడి చేసినట్లు బాధితుడి అక్క రాజవ్వ సీపీకి ఫిర్యాదు చేసింది.
Similar News
News January 12, 2025
నిజామాబాద్: తగ్గుముఖం పట్టిన కోడిగుడ్ల ధరలు
కోడి గుడ్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గత ఆదివారం 100 గుడ్లు రూ.580 పలుకగా ఈ ఆదివారం కోడిగుడ్ల ధరలు తగ్గి 480 కు చేరాయి. అయితే చికెన్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. కిలో చికెన్ రూ. 200 నుంచి 240 (స్కిన్ లెస్), స్కిన్‌తో రూ. 180 నుంచి 200గా ఉంది. అయితే మటన్ రేట్లు మాత్రం కిలో రూ. 600 నుంచి 800గా ఉంది.
News January 12, 2025
పిట్లం: ఏటీఎం ధ్వంసం చేసి చోరీ
కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని ఎస్బీఐ ఏటీఎంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. గ్యాస్ కట్టర్లతో ఏటీఎంను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారని వారు తెలిపారు. క్లూస్ టీమ్ వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 12, 2025
NZB: రెండు బైక్‌లు ఢీ.. యువకుడి మృతి
నిజామాబాద్‌లో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది. మోస్రాకు చెందిన పీర్ సింగ్(35) పని నిమిత్తం తన బైక్‌పై నిజామాబాద్‌కు వచ్చాడు. వర్ని చౌరస్తా వద్ద ఎదురెదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో పీర్ సింగ్‌కు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఐదో టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.