News May 18, 2024
NZB: మంత్రి తుమ్మల ను కలిసిన డీసీసీబీ ఛైర్మన్
రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కుంట రమేశ్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఆయన్ను శాలువాతో సత్కరించారు. రుణమాఫీ ప్రక్రియను త్వరగా చేపట్టాలని కోరారు. రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని మరోసారి నిరూపించుకుకోవాలని ఆయన్ను కోరారు.
Similar News
News January 27, 2025
NZB: మాణిక్‌భండార్‌లో శునకాలకు బారసాల
నిజామాబాద్ నగర శివారు మాణిక్‌భండార్‌లో ఓ కుటుంబం ఆదివారం శునకాలకు బారసాల చేశారు. మాణిక్ బండారుకు చెందిన నర్సాగౌడ్ మంజుల దంపతులు ఓ శునకాన్ని తెచ్చుకుని దానికి లూసీ అని పేరు పెట్టారు. లూసీ ఇటీవల ఏడు పిల్లలకు జన్మనిచ్చింది. వీటికి ఆదివారం ఆ దంపతులు ఘనంగా బారసాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బంధువులతో పాటు చుట్టుపక్కల వారిని పిలిచి ఘనంగా విందు ఏర్పాటు చేశారు.
News January 26, 2025
NZB: ఉత్తమ ప్రిన్సిపల్‌గా డీఐఈఓ రవికుమార్
జిల్లాలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలల ఉత్తమ ప్రిన్సిపల్‌గా తిరుమాలపూడి రవికుమార్ ఎంపికయ్యారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పరేడ్ మైదానంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు చేతుల మీదుగా ఆదివారం ప్రశంసాపత్రం అందుకున్నారు. కాగా జిల్లా ఇంటర్ విద్య అధికారిగా కూడా రవికుమార్ కొనసాగుతున్నారు.
News January 26, 2025
NZB: మొదటి బహుమతి సాధించిన షేక్ అమీనా
జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.