News January 26, 2025
NZB: మంద కృష్ణకు శుభాకాంక్షలు: కవిత

పద్మ శ్రీ అవార్డుకు ఎంపికైన మంద కృష్ణ మాదిగకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ సంస్థను స్థాపించి సామాజిక న్యాయం కోసం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సుదీర్ఘ కాలంగా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి మంద కృష్ణ అని కొనియాడారు. ఆయనకు పద్మ శ్రీ అవార్డు రావడం సంతోషకరంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా మందకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 14, 2025
WATER SCARCITY.. ఆరుతడి పంటలే వేయాలి: కృష్ణాడెల్టా CE

AP: 2026 మే వరకు సాగు, తాగు అవసరాలకు 228 TMCల నీరు అవసరమని కృష్ణాడెల్టా CE రాంబాబు తెలిపారు. ‘శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి వినియోగించినది పోగా AP వాటా ఇంకా 118 TMCలే ఉంది. పులిచింతలలోని 40 TMCలను కలిపితే మొత్తం 158TMCలు అందుబాటులో ఉంది. ప్రస్తుత అవసరాలను దీనితోనే తీర్చాలి’ అని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు రబీ పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలే వేసుకోవాలని సూచించారు.
News November 14, 2025
హత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు: ఎస్పీ

ఎల్.కోట మండలం రేగలో 2021లో భూతగాదాల వివాదంతో హత్య జరిగింది. ఈ కేసులో ముగ్గురి నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.3వేల చొప్పున జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత తీర్పు ఇచ్చారని SP దామోదర్ తెలిపారు. ఈశ్వరరావు అనే వ్యక్తిని కర్రలతో దాడి చేసి చంపినట్టు నేరం రుజువైనందున విశ్వనాథం, దేముడమ్మ, లక్ష్మిలకు శిక్ష విధించారని వెల్లడించారు. ఏ1గా ఉన్న నిందితుడు అప్పారావు విచారణలో మృతి చెందాడన్నారు.
News November 14, 2025
పిల్లల ఎదుగుదలపై దృష్టి పెట్టాలి: దీపక్ తివారీ

పిల్లల ఎదుగుదల, ప్రవర్తనపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్, ఇన్చార్జి విద్యాధికారి దీపక్ తివారీ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశానికి ఆయన హాజరయ్యారు. పిల్లల ప్రవర్తన, ఎదుగుదలలో తల్లిదండ్రుల పాత్ర ముఖ్యమని తెలిపారు.


