News April 15, 2024
NZB: మద్యం మత్తులో ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం.. స్టేషన్‌కు తరలింపు

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఎదుట ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఓ ఏఆర్ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. తాను స్కూటీపై వెళుతుంటే కారులో వెళుతున్న వారు ఢీ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కారును ఆపి వారి నుంచి బలవంతంగా ఆర్సీ తీసుకుని అరగంట సేపు రచ్చ చేశాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న వన్ టౌన్ SHO విజయ్ బాబు ఆర్సీ తీసుకుని బాధితులకు అప్పగించి కానిస్టేబుల్‌ను స్టేషన్‌కు తరలించి టెస్ట్‌లు చేశారు
Similar News
News April 20, 2025
NZB: ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలి: సీపీ

భవనాలు, పరిశ్రమలు, పాఠశాలలు, దుకాణాల్లో ఖచ్చితంగా ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని సీపీ సాయి చైతన్య సూచించారు. అగ్నిమాపక శాఖ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఆదివారం నిజామాబాద్ ఫైర్స్టేషన్లో నిర్వహించారు. అనంతరం పదవీ విరమణ చేసిన లీడింగ్ ఫైర్మెన్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఫైర్ ఆఫీసర్ నర్సింగ్ రావు, సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు.
News April 20, 2025
బోధన్ డంపింగ్ యార్డ్ అగ్ని ప్రమాదంపై సబ్ కలెక్టర్ ఆరా

బోధన్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్‌లో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని బోధన్ సబ్-కలెక్టర్ వికాస్ మహతో పరిశీలించారు. మంటలను అదుపు చేసి, వీలైనంత త్వరగా ఆర్పడానికి తక్షణ అవసరమైన చర్యలు, అలాగే జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. మరోసారి ఇలా జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బోధన్ మున్సిపల్ కమిషనర్‌తో వెంకట నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.
News April 20, 2025
NZB: రేపు ప్రజావాణి రద్దు

ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజావాణి రద్దయ్యింది. సోమవారం జిల్లా కేంద్రంలో రైతు మహోత్సవం ప్రారంభోత్సవం ఉన్నందున ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 28 నుంచి తిరిగి యథావిధిగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.