News July 17, 2024
NZB: మద్యం మత్తులో యాసిడ్ తాగి యువకుడి మృతి
మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్లో చోటుచేసుకుంది. ఆటోనగర్కు చెందిన షేక్ మాజిద్(31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సోమవారం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన మాజిద్ బాత్రూమ్లో ఉన్న యాసిడ్ తాగాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై SI మొగులయ్య కేసు నమోదు చేశారు.
Similar News
News February 8, 2025
NZB: యువకుడి ప్రాణం తీసిన ఇన్స్టాగ్రాం
ముగ్గురు స్నేహితుల మధ్య జరిగిన గొడవ కారణంగా యువకుడు పురుగుల మందు సేవించి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటన మోపాల్లో చోటుచేసుకుంది. ఎస్ఐ యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. కంజర గ్రామానికి చెందిన విశాల్(19) మరో ఇద్దరు స్నేహితుల మధ్య ఇంస్టాగ్రామ్ విషయంలో గొడవ జరిగింది. దీంతో విశాల్ గత నెల 16న పురుగుల మందు తాగాడు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు.
News February 8, 2025
NZB: ప్రభుత్వ బడుల్లో ప్రమాణాలు మెరుగుపర్చాలి: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు అంకిత భావంతో కృషి చేయాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన HMలు, MEOల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసి, ఉపాధ్యాయ వృత్తికి సార్ధకత చేకూర్చినవారవుతారని హితవు పలికారు.
News February 7, 2025
NZB: కోటగల్లీలో అగ్ని ప్రమాదం, రెండిళ్లు దగ్ధం
నిజామాబాద్ నగరంలోని కోటగల్లీ మార్కండేయ మందిరం సమీపంలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. దీపం కారణంగా ప్రమాదవశాత్తు జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మధిర ప్రసాద్, సుమలత అనే ఇద్దరికి చెందిన ఇండ్లు దగ్ధమయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు ఇండ్లలోని వస్తువులన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధితులు కన్నీరు మున్నీరయ్యారు.