News July 17, 2024

NZB: మద్యం మత్తులో యాసిడ్ తాగి యువకుడి మృతి

image

మద్యం మత్తులో యాసిడ్ తాగి ఓ యువకుడు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షేక్ మాజిద్(31) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు. సోమవారం మద్యం మత్తులో ఇంటికి వెళ్లిన మాజిద్ బాత్‌రూమ్‌లో ఉన్న యాసిడ్ తాగాడు. తీవ్రంగా కడుపునొప్పి రావడంతో గమనించిన కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ ఘటనపై SI మొగులయ్య కేసు నమోదు చేశారు.

Similar News

News February 15, 2025

నిజాంసాగర్: అప్పుల బాధతో ఉరేసుకొని వ్యక్తి మృతి

image

అప్పుల బాధతో ఓ వ్యక్తి ఉరేసుకొని మృతి చెందిన ఘటన శనివారం నిజాంసాగర్‌లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు.. లక్ష్మీ, జీవన్‌లకు 27 సంవత్సరాల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. పెద్ద కూతురు పెళ్లి చేయగా అప్పులు అయ్యాయి. దీంతో భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరిగేవి. శనివారం జీవన్ మనస్తాపానికి గురై ఉరేసుకొని మృతి చెందాడు. భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 15, 2025

నిజామాబాద్: 18, 19వ తేదీల్లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్

image

నిజామాబాద్ మీదుగా నడిచే కృష్ణా ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను నిర్ణీత సమయం కన్నా 90 నిమిషాల తేడాతో ఈ నెల 18, 19న రీ షెడ్యూల్ చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. విజయవాడ- కాజీపేట మధ్య ఇంటర్ లాకింగ్ సిస్టం వర్క్ బ్లాక్‌తో వరంగల్, కాజీపేట మీదుగా నడిచే పలు రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు. ఈ నెల 17 నుంచి 20 వరకు షాలిమార్, కోణార్క్ రైళ్లను దారి మళ్లించారు. ఈ విషయాన్ని రైల్వే ప్రయాణికులు గమనించాలన్నారు.

News February 15, 2025

NZB: ఘనంగా సంత్ సేవాలాల్ జయంతి వేడుకలు

image

గిరిజనుల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి ఉత్సవాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు. వినాయకనగర్‌లోని సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి కలెక్టర్, స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల బాధ్యులు, జిల్లా అధికారులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

error: Content is protected !!