News February 27, 2026
NZB: మద్యం మత్తులో 100కు ఫోన్.. 10 రోజుల జైలు

మద్యం మత్తులో డయల్ 100కు ఫోన్ చేసి అసభ్యంగా ప్రవర్తించిన రేంజర్ల గ్రామానికి చెందిన సరుగుల ప్రేమ్ కుమార్‌కు ఆర్మూర్ కోర్టు 10 రోజుల జైలు శిక్ష విధించింది. నిందితుడిని ముప్కాల్ పోలీసులు ఆర్మూర్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా, అత్యవసర సేవలకు ఆటంకం కలిగించినందుకు ఈ తీర్పునిచ్చినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. తప్పుడు సమాచారం లేదా అసభ్య ప్రవర్తనతో పోలీసుల సమయాన్ని వృథా చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Similar News
News April 14, 2026
సంగారెడ్డి: జీవితం అంటే ఓటమి కాదు.. మరో అవకాశం..!

విద్యార్థులారా..! కాగితం మీద పడ్డ ‘ఫెయిల్’ ముద్ర, నీ నుదుటి రాతను మార్చలేదు. పదో తరగతిలో తడబడిన సచిన్, ప్రపంచం కొలిచే శిఖరమయ్యాడు.. నువ్వు విసిరేసిన ప్రాణం, నీ కన్నవారికి తీరని శోకమవుతుంది. ఓటమి అనేది ముగింపు కాదు.. నిన్ను నువ్వు దిద్దుకునే ఒక మలుపు..!. ఇంటర్ రిజల్ట్స్ తర్వాత సంగారెడ్డి జిల్లా మనూరు, నాగలిగిద్ద, సిద్దిపేట జిల్లాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఉమ్మడి జిల్లాను కలవరపెట్టాయి. ఇలా చేయకండి.
News April 14, 2026
ఉమ్మడి గుంటూరు జిల్లాలో మండిపోతున్న ఎండలు!

గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో సోమవారం ఎండలు మండిపోయాయి. రెంటచింతలలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ఠ, 27 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసరావుపేటలో 42, గుంటూరులో 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తెనాలిలో 38 డిగ్రీలు నమోదు కాగా, బాపట్ల, చీరాలలో 36 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. భారీ ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News April 14, 2026
గర్భాశయంలో ఫైబ్రాయిడ్స్.. లక్షణాలు ఇవే

కొందరు మహిళల గర్భాశయంలో ఫైబ్రాయిడ్లు అనే గడ్డలు తయారవుతుంటాయి. దీని వల్ల నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఈ ఫైబ్రాయిడ్స్ పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడిపడి తరచూ మూత్రవిసర్జన, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరగడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.


