News April 28, 2024

NZB: మద్యం మత్తు.. 267 మంది జైలుకు..!

image

మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు బలవుతున్నారు. NZB జిల్లాలో చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాల్లో అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడమే కారణమని తెలుస్తోంది. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా పట్టుబడిన వారిని జైలుకు పంపిస్తున్నా, జరిమానాలు విధిస్తున్నా తీరు మారడం లేదు. ఈ ఏడాది 3 నెలల్లో NZB పోలీసు కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 649కి పైగా నమోదు కాగా 267 మందిని జైలుకు పంపించారు.

Similar News

News November 12, 2024

బిక్కనూర్: ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్

image

బిక్కనూర్ మండలం కాచాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేసే ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు మండల విద్యాధికారి రాజా గంగారెడ్డి తెలిపారు. పాఠశాలలో మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్, అతనికి సహకరించిన ప్రధానోపాధ్యాయుడు కాంత్ రెడ్డిని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 12, 2024

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి: KMR కలెక్టర్

image

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం మినీ సమావేశ మందిరంలో పౌరసరఫరాలు, మార్కెటింగ్, తదితర అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, కొనుగోళ్లు చేసిన ధాన్యాన్ని సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని, ట్యాబ్ ఎంట్రీలు త్వరగా చేయాలని అధికారులకు సూచించారు.  

News November 12, 2024

NZB: రైలులో రెండేళ్ల బాలుడు లభ్యం

image

రైలులో రెండేళ్ల బాలుడు లభ్యమైనట్లు నిజామాబాద్ రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు. NZB నుంచి ముంబై వెళ్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్‌లో బాసర రైల్వే స్టేషన్ వద్ద S6 కోచ్‌లో రెండేళ్ల బాలుడిని స్థానికులు గుర్తించారు. చుట్టుపక్కల వెతికినా ఎవరూ లేకపోవడంతో రైల్వే ఎస్ఐ, సిబ్బంది కలిసి బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ సభ్యులకు అప్పగించారు. వివరాలు తెలిసిన వారు 8712658591 నంబర్‌ను సంప్రదించాలన్నారు.