News March 15, 2025
NZB: మనవడి బర్త్‌డే.. తాత సూసైడ్

NZBకి చెందిన రాఘవేంద్రరావు(60) HYD మియాపూర్‌లో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మనవడి బర్త్‌డే పార్టీ కోసం కుటుంబ సభ్యులు శుక్రవారం షాపింగ్‌కు వెళ్లారు. ఈ సమయంలో రాఘవేంద్రరావు బలవణ్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 18, 2025
NZB: జిల్లా ప్రజల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నా: జడ్జి

జిల్లా ప్రజలు, న్యాయవాదుల ఆత్మీయతను మూట కట్టుకొని వెళ్తున్నానని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జడ్జికి గురువారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ.. న్యాయవాదులు, న్యాయమూర్తుల ఉమ్మడి లక్ష్యం కక్షిదారులకు కాలానుగుణంగా న్యాయ సేవలు అందించడమేనన్నారు. సివిల్, క్రిమినల్ కేసులను పరిష్కరించే వరకు సమష్టిగా శ్రమించామని గుర్తు చేశారు.
News April 18, 2025
NZB: రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు: కలెక్టర్

భూమి కలిగిన ప్రతి రైతుకు ఆధార్ కార్డు తరహాలో ‘భూధార్’ కార్డు ఇవ్వనున్నట్లు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. గురువారం ఏర్గట్ల మండలం బట్టాపూర్‌లో భూభారతి నూతన చట్టంపై రైతులకు అవగాహన కల్పించి మాట్లాడారు. ఇది వరకు ధరణిలో రికార్డుల నిర్వహణ లేదని, ఇప్పుడు రికార్డుల నిర్వహణ ఉంటుందని చెప్పారు.
News April 18, 2025
NZB: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్

ఆర్టీసీ బస్సుల రాకపోకల వివరాల కోసం ప్రత్యేకంగా సేవలు అందుబాటులోకి వచ్చాయి. నిజామాబాద్ రీజియన్‌లో ఆర్టీసీ ప్రయాణికులు బస్సుల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకు ఫోన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఎం జ్యోత్స్న పేర్కొన్నారు. ఆర్మూర్-73828 43133, నిజామాబాద్-99592 26022, కామారెడ్డి-73828 43747, బోధన్-98495 00725, బాన్సువాడ-94911 05706 నంబర్‌లకు ఫోన్‌చేసి బస్సుల వివరాలు తెలుసుకోవచ్చన్నారు.