News October 21, 2024

NZB: మరో కాంగ్రెస్ నాయకుడికి వరించిన పదవి

image

నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో కాంగ్రెస్ నాయకుడికి సోమవారం రాష్ట్ర పదవి వరించింది. జిల్లా కేంద్రానికి చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌ను తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రఘునందన్ రావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఏదైనా కార్పొరేషన్ లేదా కమిషన్‌కు ఛైర్మన్‌గా నియమిస్తారని గంగాధర్ ఆశాభావంతో ఉన్నారు.

Similar News

News February 28, 2026

నవీపేట్‌: పాలిటెక్నిక్ కళాశాల శివారులో చిరుత కలకలం

image

నవీపేట్ మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వెనుక గుట్ట ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం చిరుత కనిపించినట్లు కళాశాల విద్యార్థులు తెలిపారు. అప్రమత్తమైన కళాశాల సిబ్బంది ఆ ప్రాంతానికి ఎవరూ వెళ్లవద్దని సూచించారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.

నిజామాబాద్: డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు

image

నిజామాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి, వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీ సాయిచైతన్య పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… అరైవ్ అలైవ్ -2026 రెండో దశలో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డ్రైవర్లకు చూపు, వినికిడి సమస్యలు మెరుగైతే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆయన అన్నారు. అదేవిధంగా అత్యవసర సమయాల్లో సీపీఆర్ విధానంపై అవగాహన కల్పించారు.