News March 3, 2025
NZB: మల్క కొమురయ్య నేపథ్యం ఇదే..!

KNR-ADB-NZB-MDK ఉపాధ్యాయ MLCగా విజయం సాధించిన మల్క కొమురయ్య 1959 OCT 1న పెద్దపల్లి జిల్లా బంధంపల్లిలో జన్మించారు. ఆయన OUలో సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు.1983లో ఆయన శాలివాహనగ్రూప్ డైరెక్టర్‌గా జాయిన్ అయ్యారు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఎడ్యుకేషన్ సొసైటీ ఛైర్మన్‌గా ఉన్నారు. గత MPఎన్నికల్లో ఆయన BJPతరఫున మల్కాజిగిరి టికెట్ ఆశించారు. కాగా TPUSఅభ్యర్థిగా MLCకి పోటీ చేసిన ఆయనకు BJPమద్దతు ఇచ్చింది.
Similar News
News March 19, 2025
NZB: నేడే బడ్జెట్.. జిల్లాకు కావాలి నిధులు

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ బుధవారం ఉదయం ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటుకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది. అలాగే గోదావరి పరివాహ ప్రాంతాల అభివృద్ధితో పాటు ఆర్మూర్ పట్టణంలోని సిద్దుల గుట్ట అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు. మరి బడ్జెట్ కేటాయింపు ఎలా ఉండనుందో.?
News March 19, 2025
భీమ్‌గల్: చేపల వలలో చిక్కుకొని జాలరి మృతి

చెరువులో చేపలు పడుతూ వ్యక్తి నీటిలో మునిగి చనిపోయిన ఘటన నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం సిద్దపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. SI మహేశ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తోపారం బొర్రన్న చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం చెరువులో చేపల వేటకు వెళ్లగా, ప్రమాదవశాత్తు వలలో చిక్కుకుని నీటిలో మునిగి చనిపోయాడని తెలిపారు. కేసు నమోదు చేసినట్లు SI వెల్లడించారు.
News March 19, 2025
బడ్జెట్‌లో నిజామాబాద్‌కు కావాలి నిధులు

తెలంగాణ అసెంబ్లీలో బుధవారం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో నిజామాబాదు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులకు నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. బోధన్ చక్కెర ఫ్యాక్టరీ, సారంగాపూర్ శేఖర్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించాలి. అలాగే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రి మరమ్మతులు, ఆసుపత్రిలో పరికరాల కోసం నిధులు కేటాయించాలి. తాగు, సాగునీటి కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.