News March 22, 2024
NZB: మహిళ హత్య కేసులో నలుగురికి యావజ్జీవ కారాగార శిక్ష
మహిళను కిరాతకంగా హత్య చేసిన కేసులో నలుగురు నిందితులకు 14 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ జిల్లా జడ్జి సునీతా కుంచాల శుక్రవారం తీర్పు చెప్పారు. ఆర్మూర్ శివారులోని మామిడిపల్లిలో ఒంటరిగా నివాసం ఉండే బొణికే భారతి (55)ను 2018లో తోకల చిత్ర, బట్టు వెంకటేష్, పందిర్ల రాజేందర్ గౌడ్, బట్టు రంజిత్ గొంతు కోసి హత్య చేసిన అభియోగాలు నిర్దారణ కావడంతో జిల్లా జడ్జిపై మేరకు తీర్పు చెప్పారు.
Similar News
News November 17, 2024
NZB: పరీక్ష కేంద్రాలకు ఆలస్యంగా అభ్యర్థులు
నిజామాబాద్‌లోని ఉమెన్స్ కళాశాల గ్రూప్ -3 పరీక్షా కేంద్రం వద్ద అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు అనుమతించలేదు. సమయం పూర్తి కావడంతో కేంద్రం గేట్లు మూసేశారు. ముబారక్ నగర్ నుంచి ఒకరు, కామారెడ్డి నుంచి ఒకరు మొత్తం ఇద్దరు అభ్యర్థులు పరీక్షకు ఆలస్యంగా వచ్చి కేంద్రం గేట్లు మూసి ఉండటంతో నిరాశతో వెనుదిరిగారు.
News November 17, 2024
రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ వాసి మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బైపాస్ వద్ద శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదర్శనగర్ మలుపు వద్ద ఓ కారు కల్వర్టును ఢీకొంది. ఈ ఘటనలో NZB జిల్లా డిచ్పల్లికి చెందిన సురేశ్ స్పాట్‌లో మృతిచెందగా, కుత్బుల్లాపూర్‌కు చెందిన నరసింహారావు, శివకుమార్ సంగారెడ్డిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. వారు ముగ్గురు కలిసి కారులో మహారాష్ట్రలోని గానుగాపూర్ దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
News November 17, 2024
KMR: జిల్లాలో గ్రూప్-3 రాత పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు: SP
ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు జరిగే గ్రూప్-3 రాత పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు శాఖ పటిష్ట భద్రతా, బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగిందని కామారెడ్డి జిల్లా SP సింధు శర్మ తెలిపారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS (144 సెక్షన్) అమలులో ఉంటుందన్నారు.