News March 13, 2025

NZB: మార్కెట్ యార్డుకు 3 రోజులు సెలవులు

image

నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌కు వరుస సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. 14న హోలీ, 15న దల్హండి, 16న ఆదివారం కావడంతో మార్కెట్ యార్డులో ఎలాంటి క్రయవిక్రయాలు జరగవన్నారు. దీనిని గమనించి రైతులు పంట దిగుబడులను మార్కెట్ యార్డుకు తీసుకురావద్దని సూచించారు. 17తేదీ నుంచి యథావిధిగా మార్కెట్ యార్డులో క్రయవిక్రయాలు కొనసాగుతాయని తెలిపారు.

Similar News

News March 25, 2025

NZB: ‘మహిళా సంఘాలకు 200 పైచిలుకు కొనుగోలు కేంద్రాలు’

image

యాసంగి సీజన్ ధాన్యం సేకరణ ప్రక్రియలో భాగంగా మహిళా స్వయం సహాయక సంఘాలకు విరివిగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేటాయించాలని నిర్ణయించినట్లు మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే పీ.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. జిల్లాలో 670 కొనుగోలు కేంద్రాలకు గానూ మహిళా సంఘాలకు కనీసం 200పైచిలుకు కేంద్రాలను కేటాయించేలా చర్యలు తీసుకున్నామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి మహిళా సంఘాలకు ఆయన కీలక సూచనలు చేశారు.

News March 25, 2025

సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి!

image

మంత్రివర్గ విస్తరణలో భాగంగా బోధన్ MLAకు కల్పిస్తారన్న చర్చ నడుస్తోంది. కాగా MLC మహేశ్ కుమార్ గౌడ్‌కు PCC పదవి వరించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే BSWDకి చెందిన కాసుల బాల్‌రాజ్‌‌కు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ ఛైర్మన్‌గా నియమించింది. బాల్కొండకు చెందిన ఈరవత్రి అనిల్‌కు టీజీఎండీసీ ఛైర్మన్‌గా నియమించింది. కాగా ఉమ్మడి జిల్లా నుంచి ఇప్పటి వరకు ఎవరికి మంత్రి పదవీ దక్కలేదు. జిల్లాకు అమాత్య యోగముందా కామెంట్ చేయండి.

News March 25, 2025

నిజామాబాద్: తగ్గిన ఎండ తీవ్రత..

image

నిజామాబాద్ జిల్లాలో ఎండ తీవ్రత కాస్త తగ్గింది. సోమవారం మంచిప్పలో 38.8℃ ఉష్ణోగ్రత నమోదైంది. అదేవిధంగా కమ్మర్పల్లిలో 38.7℃, కోటగిరి 38.6, లక్మాపూర్ 38.5, మల్కాపూర్, ఎడపల్లి, గోపనపల్లె 38.4, ధార్పల్లి, మోర్తాడ్ 38.3, పెర్కిట్, వైల్‌పూర్, కోనసమందర్, ఎర్గట్ల 38.2, మోస్రా, భీంగల్, మెండోరా 38.0, ఆలూర్ 37.8, ముప్కల్, బాల్కొండ 37.7, నిజామాబాద్ 37.6℃ ఉష్ణోగ్రత నమోదైంది.

error: Content is protected !!