News August 7, 2024
NZB మాల్లో యువతి పట్ల బాలుడి అసభ్య ప్రవర్తన
నిజామాబాద్ నగరంలోని నిఖిల్ సాయి హోటల్ పక్కనే ఉన్న మాల్లో ఓ యువతి పట్ల పదహారేళ్ల బాలుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. లిఫ్టులో నుంచి బయటకు వెళ్లే సమయంలో యువతి చేయి పట్టుకుని లాగాడు. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా సదరు యువతి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు సదరు బాలుడికి మతిస్థిమితం బాగాలేదని గుర్తించారు.
Similar News
News January 15, 2025
NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్
తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.

NZB: పసుపు బోర్డుతో అందరికీ లాభం: MP అర్వింద్
పసుపు బోర్డుతో కేవలం పసుపు రైతులకే ఉపయోగం ఉంటుందని కొంతమంది భావిస్తున్నారని, కానీ దాని వల్ల అందరికీ లాభం ఉంటుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి చెప్పారు. నిజామాబాద్లో అల్లం, పసుపు, కూరగాయలు అనేక పంటలు పండుతాయని ఆ రైతులకూ లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్పారు. అలాగే నిజామాబాద్ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని, బోర్డుతో వారికీ ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు.