News September 5, 2024
NZB: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!
విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT
Similar News
News September 10, 2024
జక్రాన్‌పల్లి: చోరీకి గురైన శివలింగం
నూతనంగా నిర్మించనున్న శివాలయం స్థలంలో తాత్కాలికంగా ప్రతిష్ఠించిన శివలింగాన్ని గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లిన ఘటన వారం రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మండలంలోని మునిపల్లి గ్రామంలోని వడ్డెర కాలనీలో నిర్మించనున్న గుడి స్థలంలో ప్రతిష్ఠించిన శివలింగం చోరీకి గురైనట్లు స్థానికులు కాలనీవాసులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 10, 2024
NZB: ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
డిచ్పల్లి మండలం రాంపూర్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించబోయే వృద్ధాశ్రమంలో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ ఆంజనేయులు తెలిపారు. హోమ్ కోఆర్డినేటర్, అసిస్టెంట్ కోఆర్డి నేటర్, ఏఎన్ఎం, వంట మనిషి, వంట సహాయకుడు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈ నెల 18లోపు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News September 10, 2024
NZB: నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు
నిజామాబాద్ జిల్లా ప్రజలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఈ నెల 17 నుంచి నిర్వహించే ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ప్రజాపాలనలో కార్డులు లేనివారికి ఇస్తారా? కుటుంబీకుల పేర్లు జత చేర్చుతారా? ప్రస్తుతం ఉన్నవారికి కొత్తకార్డులు ఇస్తారా తెలియాల్సి ఉంది. అయితే కొత్త కార్డుల జారీకి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదని అధికారులు వెల్లడించారు.