News March 19, 2025

NZB: ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు 743 మంది ఆబ్సెంట్

image

నిజామాబాద్ జిల్లాలో బుధవారంతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ముగిశాయని నిజామాబాద్ DIEO రవికుమార్ తెలిపారు. చివరి రోజు కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షకు మొత్తం 743 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని జిల్లాలో మొత్తం 19,349 మంది విద్యార్థులకు 18,606 మంది పరీక్షలకు హాజరయ్యారన్నారు. కాగా పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసినట్లు రవి కుమార్ వివరించారు.

Similar News

News March 20, 2025

NZB: చివరి రోజు 438 ఆబ్సెంట్

image

జిల్లా వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఒకేషనల్ బ్రిడ్జి కోర్సు పరీక్షలు 22వ తేదీన నిర్వహించనున్నట్లు DIEO రవికుమార్ తెలిపారు. గురువారం రెండో సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు నిర్వహించారు. 438 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 15,896 మంది విద్యార్థులకు 15,458 మంది పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. మొత్తం 97.2% విద్యార్థులు పరీక్షలు రాశారు.

News March 20, 2025

నిజామాబాద్ జిల్లాకు నిరాశ!

image

రాష్ట్ర బడ్జెట్ నిజామాబాద్ జిల్లా ప్రజలను నిరాశపరిచింది. నిజాంషుగర్స్ ఫ్యాక్టరీలకు సంబంధించి బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. తెలంగాణ యూనివర్సిటీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. జక్రాన్ పల్లి ఎయిర్ పోర్టుకు సంబంధించి భూసేకరణ ఊసేలేదు. కాగా శ్రీరాంసాగర్ మెుదటి దశ ప్రాజెక్టుకు రూ.100 కోట్లు కేటాయించారు. కాగా ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ.. జిల్లాకు నిధులు కేటాయించలేదని ఆరోపించారు.

News March 20, 2025

NZB: ఇస్రో యువ విజ్ఞాన కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానం

image

యువ శాస్త్రవేత్తలకు ఇస్రో ఆహ్వానం పలుకుతోంది. యువతకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం(యువికా) నిర్వహిస్తోంది. ఈ సారి 9వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో పాల్గొనే విద్యార్థులకు నేరుగా శాస్త్రవేత్తలతో మాట్లాడేందుకు అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఈ నెల 23వ తేదీలోగా www.isro.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

error: Content is protected !!