News April 3, 2025
NZB: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. SHARE IT.
Similar News
News April 12, 2025
NZB: చేపలు పట్టేందుకు వెళ్లి బావ, బావమరిది మృతి

చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా నందిపేటలో చోటు చేసుకుంది. మాచర్లకి చెందిన షేక్ షాదుల్లా, అతని బావమరిది మహమ్మద్ రఫీక్ నిన్న సిద్దాపూర్ శివారులోని వాగులో చేపలు పట్టేందుకు వెళ్లారు. షేక్ రఫిక్ కాలుజారి ప్రమాదవశాత్తు వాగులో పడ్డాడు. అతన్ని రక్షించేందుకు షాదుల్లా వాగులో దిగగా ఇద్దరు మునిగిపోయారు. మృతదేహాలను వెలికి తీసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
News April 12, 2025
NZB: పోలీసుల అదుపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడు

క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న షేక్ ఆసిఫ్ అలీని అదుపులోకి తీసుకున్నట్లు సౌత్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. నరేశ్ కుమార్ తెలిపారు. నిజామాబాద్ లతీఫ్ కాలనీకి చెందిన షేక్ ఆసిఫ్ అలీ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడని సమాచారం మేరకు 6వ టౌన్ పోలీస్ సిబ్బందితో కలిసి అర్సపల్లి బైపాస్ రోడ్డు వద్ద అతనిని పట్టుకొని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
News April 12, 2025
కామారెడ్డి: కల్తీ కల్లు ఘటన.. సీఎం సమీక్ష..?

ఇటీవల కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు తాగి 99మంది అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమీక్ష జరిపి వరుస కల్తీ ఘటనలపై ఆరా తీయనున్నారు. ఈ సమావేశానికి ఎక్సైజ్ అధికారులు హాజరుకానున్నారు. దామరంచ, అంకోల్, దుర్కి, సంగెం మండలాల్లో 69మంది, గౌరారంలో 30 మంది కల్తీ కల్లుతాగి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురుని అరెస్టు చేశారు. 27మందిపై కేసు నమోదుచేశారు.