News December 8, 2024

NZB: ముగ్గురు బిడ్డలను అమ్మేసిన కసాయి తల్లి

image

కన్నతల్లే ముగ్గురు బిడ్డలను అమ్మేసిన ఘటన ఆర్మూర్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. SHO సత్యనారాయణ వివరాలు.. మామిడిపల్లికి చెందిన భాగ్యలక్ష్యి భర్త చనిపోయాడు. దీంతో ఆమె ఇంకో పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలను కన్నది. కాగా మొదటి భర్తకు పుట్టిన ఏడేళ్ల బాబు, ఇద్దరు మగ కవల పిల్లలను రూ.4లక్షలకు ముగ్గురు వ్యక్తులకు విక్రయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెతో పాటు పిల్లలను కొన్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

Similar News

News January 13, 2025

NZB: ఊరు వాడా ఘనంగా భోగి సంబురం

image

ఉమ్మడి NZB జిల్లాల్లో సంక్రాంతి సంబురాలు షురూ అయ్యాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలి రోజు సోమవారం భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఊరు వాడా జనం పొద్దున్నే లేచి భోగి మంటలు వేసుకున్నారు. తమ ఇండ్ల ముందు యువతులు, చిన్నారులు రంగు రంగుల ముగ్గులు వేస్తూ..సందడి చేశారు. అటు యువకులు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ గాలి పటాలు ఎగురవేస్తూ..ఎంజాయ్ చేస్తున్నారు.

News January 13, 2025

NZB: ఇద్దరు మహిళలు సూసైడ్ అటెంప్ట్.. కాపాడిన పోలీసులు

image

బాసర గోదావరిలో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఎస్ఐ గణేశ్ తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన మహిళతో పాటు మహరాష్ట్రలోని నాందేడ్ జిల్లా చెందిన మరో మహిళ గోదావరిలో దూకేందుకు యత్నించగా పోలీసులు కాపాడారు. NZBకు చెందిన మహిళా కుటుంబ సభ్యులతో గొడవపడి గోదావరిలో దూకేందుకు యత్నించగా అటుగా వెళ్తున్న ఎస్సై ఆమెను అడ్డుకున్నారు. నాందేడ్ కు చెందిన మహిళను మహిళ కానిస్టేబుల్ అడ్డుకున్నారు.

News January 13, 2025

మోపాల్: కారు – బైక్ ఢీ.. వ్యక్తి మృతి

image

ఆదివారం కారు- బైక్ ఢీకొన్న ఘటనలో వ్యక్తి మృతి చెందాడు. మోపాల్ SI యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. బోర్గం(P) సంజీవరెడ్డికాలనీకి చెందిన విజయ్ కుమార్(48) మోపాల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుండగా పెట్రోల్ బంక్ వద్ద కారు బలంగా ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.